తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే బిజినెస్ ఉమెన్ ఉన్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, ఛార్మి లాంటి వాళ్లు ముందుంటారు. సినిమాలతో పాటు సంపాదించిన దాంతో బిజినెస్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా రకుల్ అయితే సూపర్ ఫాస్టు. క్రేజ్ ఉన్నపుడే ఎంచక్కా అన్నీ సెట్ చేసుకుంటుంది రకుల్.
మళ్లీ ఒక్కసారి ఇమేజ్ కానీ పోయిందంటే కనీసం పట్టించుకునే వాళ్లు కూడా ఉండరని ఆమెకు తెలియని విషయం కాదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది. అవకాశాలు వచ్చినపుడే కోట్లు వెనకేసుకుంటుంది ఈ బ్యూటీ. వెనకేసుకున్న కోట్లను మళ్లీ బిజినెస్‌లో పెట్టేసి మరిన్ని కోట్లు జమ చేసుకుంటుంది. అక్కడితో ఆగకుండా ఆస్తులు కూడబెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ముంబై భామ అయినా కూడా మకాం పూర్తిగా హైదరబాద్‌లో పెట్టేసి ఇక్కడే తన బిజినెస్ అడ్డాగా చేసుకుంది ఈ భామ. ఇప్పటికే సిటీలో ఈమెకు ఓ ఇంటితో పాటు ఎఫ్ 45 జిమ్‌లు కూడా ఉన్నారు. వాటి బ్రాంచులు విస్తరిస్తూ తన రేంజ్ పెంచుకుంటుంది రకుల్. ఆ మధ్య బెంగళూరులో కూడా ఓ అదిరిపోయే ఫ్లాట్ తీసుకుంది. అది కూడా ఓ ఖరీదైన ఏరియాలో దాదాపు 6 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈమె ఓ ఫ్లాట్ సొంతం చేసుకుందనే వార్తలు వచ్చాయి.
అక్కడ రకుల్‌కి కొంతమంది స్నేహితులు ఉన్నారు. వాళ్లిచ్చిన సలహాలు, సూచనలతోనే అక్కడ కూడా ఓ ఫ్లాట్ తీసుకుందని.. అక్కడ ఉండకపోయినా కూడా ఆస్తి ఉంటుంది కదా అని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మరో బిజినెస్ కూడా మొదలుపెట్టింది రకుల్. స్టారింగ్ యూ అనే వెబ్ సైట్ మొదలుపెట్టి అందులో ఔత్సాహికులైన నూతన నటీనటులకు మద్యవర్తిగా వ్యవహరిస్తుంది రకుల్.
సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్లకు మద్యవర్తిగా ఉంటుంది రకుల్. తనకు ఉన్న పాపులారిటీతో ఇప్పటికే స్టారింగ్ యూ వెబ్ సైట్ కొన్ని క్రేజీ నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులు కావాలి అనుకునే వాళ్లు ఈ వెబ్ సైట్‌ను అడుగుతారు.. అక్కడ వాళ్లు నమోదు చేసుకుంటే.. తమకు వచ్చిన అప్లికేషన్స్‌లో ఎవరైతే వాళ్లకు బెస్టుగా సూట్ అవుతారో.. వాళ్లను రకుల్ టీమ్ అక్కడికి పంపిస్తుంది.
అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్లకు.. నిర్మాతలకు మధ్యలో రకుల్ వారధిగా ఉంటుందున్నమాట. ఇఫ్పటికే రానా ఇలాంటి క్యాస్టింగ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే చేస్తుంది. సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలు ఆమె బిజినెస్ సక్సెస్ అవ్వడానికి దోహదపడుతాయని అనడంలో సందేహం లేదు. ఏదేమైనా తన క్రేజ్ వాడుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ మొదలుపెట్టింది రకుల్ ప్రీత్.