రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా ఈమె స్టార్ హీరోయిన్. అన్నిచోట్ల వరస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది రకుల్. ఇదిలా ఉంటే కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే ఈమె పెళ్లి చేసుకుంటుంటనే వార్తలు వస్తున్నాయి. పైగా తనకు కాబోయే వాడు ఎవరో కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది రకుల్. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో కొన్ని రోజులుగా ప్రేమాయణం నడిపిస్తుంది రకుల్.
ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయాన్ని కూడా స్వయంగా రకుల్ అనౌన్స్ చేసింది. గతేడాది ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. ఈమె ప్రేమిస్తున్న విషయం తెలిసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. తన లవ్ మ్యాటర్ బయటికి రాకుండా అంత రహస్యంగా ఎలా ఉంచిందబ్బా అని అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు పెళ్ళిపై కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇందులో నిజం లేదని చెప్తుంది ఈ భామ. ఎలాగైతే తాను ప్రేమిస్తున్న విషయాన్ని స్వయంగా చెప్పానో.. పెళ్లి మ్యాటర్ కూడా అలాగే చెప్తానంటుంది. అందులో దాచి పెట్టాల్సిన విషయం కూడా ఏం లేదని చెప్పుకొచ్చింది రకుల్. అలాంటి మంచి విషయం తానే అందరితో పంచుకుంటానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రకుల్ చేతిలో దాదాపు 10 సినిమాలున్నాయి. తెలుగు, తమిళం, హిందీ అన్ని భాషల్లోనూ నటిస్తుంది రకుల్.