కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళం, హిందీలోనూ పూజాకు అవకాశాలు వస్తున్నాయి. అన్ని భాషల్లోంచి వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కథలు నచ్చకపోతే కొన్ని సినిమాలను నిర్ధాక్షణ్యంగా నో చెప్తుంది కూడా. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబుతో పాటు మరికొందరు హీరోలతో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
పూజాహెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ధరించి బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఈమె స్విమ్మింగ్ పూల్ మధ్యలో అల్పాహారం తీసుకుంటూ కనిపించింది. ఇక టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అఖిల్ మొదటి హిట్ అందుకున్నారు.
నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉన్న బుట్టబొమ్మ దాన్నుంచి రిలీఫ్ అయ్యందుకు మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తాను దిగిన రిసార్ట్ చూపిస్తూ వీడియోలు పంచుకుంది. ఇప్పుడవీ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పూజా చెబుతూ `విరామం తీసుకునే సమయం ఇది.. ఆ తర్వాత ఏంటో చూడండి` అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది.
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు,ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు.
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది.