లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. అందాల రాక్షసి (Andala Rakshasi) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత.. ఆమె పలు సినిమాల్లో నటించినా నాని మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది అందమైన అభినయం ఉన్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి కూడా ఉంటుంది. అందాల రాక్షసితో వచ్చిన ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసింది. అయితే కోరుకున్న స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. విజయాలు కూడా ఉన్నాయి కానీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు. అయితే కొన్నాళ్లుగా లావణ్య ఎంచుకుంటున్న కథల్లో మార్పు వచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తుంది ఈమె.
డిసెంబర్ 15 ఈమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో లావణ్యకు హ్యాపీ బర్త్ డే చెప్తున్నారు అభిమానులు. మరోవైపు పరంగా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అసంబద్ధమైన చిత్రాల్లో నటించడం కంటే ఖాళీగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే లావణ్యా త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు వస్తున్నాయి.
తెలుగులో 'అర్జున్ సురవరం' విజయం తర్వాత 2021లో 'ఏ1 ఎక్స్‌ప్రెస్', ‘చావు కబురు చల్లగా’ లాంటి సినిమాల్లో లావణ్య త్రిపాఠి నటిస్తుంది. ఈ సినిమాలు ఎలా ఉన్నా కూడా అందులో లావణ్య పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా చావు కబురు చల్లగాలో అయితే విధవ పాత్రలో నటించింది. భర్త లేని ఆ పాత్రలో డీ గ్లామరస్‌గా కనిపించింది లావణ్య.
'భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఆమె నటించిన సినిమా ఇది. అయితే అంచనాలు అందుకోలేకపోయింది. తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్ రాయప్పన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక.