టాలీవుడ్ నటి లక్ష్మి మంచుకు గాయాలయ్యాయి. ఈమెకు తీవ్ర గాయాలైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోటోలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. చేతులతో పాటు కాళ్లకు కూడా రక్తం కారేలా ఉన్న ఫోటోలను చూసి వాళ్లు టెన్షన్ పడుతున్నారు. అసలేమైంది మంచు లక్ష్మికి అంటూ ఆరా తీస్తున్నారు. చేతి వేళ్ళకు బలంగా దెబ్బ తగలడం వల్ల రక్తం వచ్చినట్లు అర్థమవుతుంది.
అలాగే కాలికి కూడా జీన్స్ ప్యాంట్ వేసుకున్నా కూడా లోపలి వరకు చీల్చి రక్తం కారుతుంది. ఈ ఫొటోలను లక్ష్మీ మంచు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అవి చూసిన వెంటనే ఏమైంది అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చింది. అవి నిజమైన గాయాలు కావు.. రియాల్ యాక్సిడెంట్ కాదు, రీల్ యాక్సిడెంట్ మాత్రమే. షూటింగ్ కోసం ఆ విధంగా ఆమె మేకప్ వేసుకుంది.
అసలు విషయం తెలుసుకుని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి విషయంలో జోక్స్ ఏంటి అండీ అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మీ నటిగా చాలా బిజీ అయిపోయింది. ఈమె చేతిలో ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది మంచు వారమ్మాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలో కూడా లక్ష్మీ మంచు ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
అన్ని సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది లక్ష్మి. ఈమె నటిస్తున్న సినిమాల్లో భాగంగానే ఈమెకు రీల్ యాక్సిడెంట్ జరిగింది. అంటే షూటింగ్ కోసం సిద్ధం అవుతూ మేకప్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. ఓ సినిమాలో ఆమె ఫైట్ సీక్వెన్స్ కోసం చేసుకున్న ఫోటోలు ఇవి. తీవ్ర గాయాల పాలైన చెయ్యి, మోకాలి ఫొటోలు చూసి చాలామంది నిజంగానే యాక్సిడెంట్ అయ్యిందని కంగారు పడ్డారు.