ఏం చేస్తాం.. కొన్నిసార్లు కొందరు హీరోయిన్లకు సుడి అలా తిరుగుతుంది మరి. కొందరు ముద్దుగుమ్మలకు ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా హిట్స్ రావు. కానీ కొందరికి మాత్రం తొలి సినిమాతోనే చక్రం తిరిగిపోతుంది. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. నిజానికి ఉప్పెనలో ముందు హీరోయిన్ ఈమె కాదు.. ముందు మరో అమ్మాయిని తీసుకుని.. షూట్ చేసి ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు.
మనీషా రాజ్ అనే మరో అమ్మాయిని తీసుకుని ఎందుకో మనసు కుదరక కృతి వైపు వచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా 51 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది ఉప్పెన. ఇప్పటి వరకు ఏ డెబ్యూ హీరోకు సాధ్యం కాని రీతిలో ఉప్పెన వసూళ్ల ఉప్పెన కురిపించింది.
ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో తెలియదు కానీ కృతి మాత్రం పాపులర్ అయిపోయింది. ఏకంగా స్టార్ హీరోయిన్ హోదా కాదు.. దానికి మించి అందుకుంది కృతి. ఈమె కోసం ఇప్పుడు హీరోలు వేచి చూస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కోట్లు కురిపిస్తున్నారు. దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. ఉప్పెన విడుదలకు ముందే ఇండస్ట్రీలో కృతి గురించి చర్చలు మొదలయ్యాయి.
ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది అంటూ ఆరా తీసారు. ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి కూడా ఇదే చెప్పాడు. ఒక్కసారి ఉప్పెన విడుదలైతే ఈ అమ్మాయి మీకు దొరకమంటే కూడా దొరకదు.. ఇప్పుడే బుక్ చేసుకోండి అంటూ చెప్పాడు. మెగాస్టార్ చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతుంది. ఉప్పెన తర్వాత మరో రెండు విజయాలు అందుకుని హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది కృతి శెట్టి.
ఉప్పెన సినిమా కోసం కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోటి 25 కావాలంటుంది. అయితే అంతకు ముందు కమిటైన సినిమాలకు మాత్రం తక్కువగానే తీసుకుంటుంది కృతి. ఈమె వయసు ప్రస్తుతం 18 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. వరసగా మూడు విజయాలు రావడంతో కృతి శెట్టి టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఈమె నితిన్ మాచర్ల నియోజకవర్గం.. సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రామ్ లింగుస్వామి సినిమాలతో బిజీగా ఉంది. వాటితో పాటు ఇప్పుడు ఒప్పుకునే సినిమాలకు 1.25 కోట్లు కావాలంటుంది కృతి. ఉప్పెన సినిమా పిచ్చెక్కించిన తీరు చూసిన తర్వాత ఈమెకు ఎంతైనా ఇవ్వొచ్చులే అనుకుంటున్నారు నిర్మాతలు. పైగా ఇప్పుడు లిప్ లాక్ సీన్స్.. బెడ్రూమ్ సీన్స్ కూడా చేస్తుంది కృతి.