Genelia Deshmukh: టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా. సత్యం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన జెనీలియా ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడే సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలతో, వీడియోలతో తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో పంచుకుంది. అందులో బ్లాక్ డ్రెస్ లో సూపర్ లుక్ తో బాగా ఆకట్టుకుంది. ఈ ఫోటో వైరల్ గా మారగా తెగ లైక్స్ అందుకుంటుంది జెనీలియా.