అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ. తాజాగా క్యూట్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలు చేస్తుంది. గీతా ఆర్ట్స్‌లో నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమాతో పాటు నిఖిల్‌తోనే కార్తికేయ 2 సినిమాలోనూ నటిస్తుంది. ఇక దిల్ రాజు బ్యానర్లో రౌడీ బాయ్స్ సినిమాలోనూ నటిస్తుంది అనుపమ. ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమ్మడు ఓ రేంజ్లో రెచ్చిపోయింది.
మరీ ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది అనుపమ. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోయింది. ఒకటి రెండు కాదు.. రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా విడుదలైన ట్రైలర్లోనే లిప్ లాక్ ఇచ్చేసింది అనుపమ పరమేశ్వరన్.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది అనుపమ. వాటిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా వామ్మో అనుకుంటున్నారు.
ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కేరళ కుట్టి. అప్పుడప్పుడూ అభిమానులతోనూ ముచ్చటిస్తూ సమాధానాలు కూడా బాగానే ఇస్తుంది అను. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ నెటిజన్ అనుపమను ఓ పిచ్చి ప్రశ్న అడిగాడు. నీ బికినీ ఫోటో పంపు అంటూ అనుపమ పరమేశ్వరన్‌ను నేరుగా అడిగేసాడు ఆ నెటిజన్. దాంతో అమ్మడుకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కోపంతో ఊగిపోయింది అనుపమ.