Naresh-Pavitra Lokesh: నరేష్, పవిత్ర లోకేష్ జంటగా పవిత్రమైన ప్రేమ కథా చిత్రమ్..!
Naresh-Pavitra Lokesh: నరేష్, పవిత్ర లోకేష్ జంటగా పవిత్రమైన ప్రేమ కథా చిత్రమ్..!
Naresh-Pavitra Lokesh: టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటున్న నరేష్, పవిత్ర లోకేష్ జీవిత గాథల ఆధారంగా ఓ అందమైన ప్రేమ కథ తెరకెక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటించే ఈ సినిమాలో తమ సహజీవనంపై క్లారిటీ ఇవ్వనున్నారట.
టాలీవుడ్లో సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరు.. ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పందించినప్పటికీ.. చాలా రోజులుగా కలిసే ఉంటుంటున్నారు.
2/ 7
మైసూర్‌లోని ఓ హోటల్లో నరేష్, పవిత్ర లోకేష్‌ని నరేష్ మూడో భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే ఇద్దరినిపై విరుచుకుపడ్డారు. ఆ గొడవ ద్వారా వీరి వ్యవహారం రచ్చకెక్కింది. ఆ తర్వాత కూడా వీరద్దరు కలిసి తిరుగుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల సమయంలోనూ ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు.
3/ 7
ఐతే వీరిద్దరికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఓ ప్రేమ కథను తెరకెక్కించబోతున్నారట. వీరిద్దరి సహజీవనాన్నే సినిమాగా చూపించబోతున్నారని..అందులో కొంత ఫిక్షన్‌ను కూడా జోడించనున్నట్లు సమాచారం.
4/ 7
పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన, నటీ నటులు, టెక్నికల్ టీమ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
5/ 7
నరేష్, పవిత్ర లోకేష్ భార్యాభర్తలుగా చాలా సినిమాల్లో నటించారు. కానీ తొలిసారిగా హీరో, హీరోయిన్గా కనించనుండడంతో ఈ మూవీకి ప్రాధాన్యత ఏర్పడింది. నరేష్అ, పవిత్ర వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాల్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
6/ 7
అసలు తమ జీవితాల్లో ఏం జరిగింది? ఎలా కలిశారు? ఎందుకు సహజీనం చేస్తున్నారన్న వివరాలను సినిమాలో రూపంలో తీసుకురానున్నట్లు సమాచారం. తమ ప్రేమ బంధంపై మంచి లవ్ స్టోరీ సినిమా ద్వారా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది..
7/ 7
రీసెంట్గా వీరిద్దరు ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’' అనే సినిమాలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహాలో విడుదలయింది. ఆ మూవీలో మూగవాడిగా నరేష్ ఆకట్టుకున్నారు. అతడి భార్య పాత్రలో పవిత్ర ఒదిగిపోయారు.