తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేష్ ఒక్కడే. ఈయనపై ఇన్నేళ్లలో ఒక్కటంటే ఒక్క కాంట్రవర్సీ కూడా రాలేదంటే అతిశయోక్తి కాదేమో..? అంత కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు వెంకటేష్. అలాంటి హీరో ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి. పైగా నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఆయన అలాంటి పోస్టులు పెట్టడం మరింత ఆసక్తి పుట్టిస్తుంది.
కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య, సమంత గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళెందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచింది వాళ్లు చెప్తూనే ఉన్నారు. మరికొందరు అయితే ఏకంగా డిబేట్స్ పెట్టి.. కచ్చితమైన కారణాలు ఇవే అంటూ కుండ బద్దలు కొడుతున్నారు. సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని.. సరోగసి వైపు అడుగులు వేసినందుకే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు చెప్తున్న కారణం. దీనిపై సమంత న్యాయస్థానం వెళ్లి వాళ్ల నోళ్లు మూయించింది కూడా.
వీటిని కొన్ని రోజులు భరించిన సమంత.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లి అందరికీ సమాధానం చెప్పింది. ఇకపై సమంతపై అలాంటి వార్తలు రాయొద్దంటూ కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఆ తర్వాత వీటిపై వార్తలు రావడం ఆగిపోయాయి. తమ ప్రైవసీకి భంగం కలిగించుకుండా ఉండాలంటూ మీడియాను కోరుకుంటున్నారంతే. ఆ తర్వాత తమ పని తాను చేసుకుంటున్నారు. సమంత ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.
చైతూ లవ్ స్టోరి సక్సెస్ ఎంజాయ్ చేయడంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నాడు. వీళ్ల విడాకులపై కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కొడుకు విడాకుల గురించి నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యాడు. అది పూర్తిగా భార్యాభర్తల వ్యక్తిగత నిర్ణయమని.. వాళ్ల మధ్య ఏం జరిగిందనేది మనం ఊహించలేం.. అది వాళ్ల ప్రైవసీకి సంబంధించిన విషయం.. ఏదేమైనా ఈ నిర్ణయం మాత్రం ఎమోషనల్ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.
తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేష్ ఒక్కడే. ఈయనపై ఇన్నేళ్లలో ఒక్కటంటే ఒక్క కాంట్రవర్సీ కూడా రాలేదంటే అతిశయోక్తి కాదేమో..? అంత కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు వెంకటేష్. అలాంటి హీరో ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి. పైగా నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఆయన అలాంటి పోస్టులు పెట్టడం మరింత ఆసక్తి పుట్టిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్ మరో పోస్ట్ కూడా పెట్టాడు. ఇది కూడా వైరల్ అవుతుంది. నిన్ను ఇష్టపడిన వాళ్లను దుర్వినియోగం చేయకు.. నువ్వే కావాలి అనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు.. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను మోసం చేయాలని చూడకు.. ఎప్పుడు గుర్తు పెట్టుకునే వాళ్లను అస్సలు మరచిపోకు అంటూ వెంకీ తన పోస్ట్‌లో తెలిపాడు. ఇది చైతూ, సమంతను ఉద్దేశించి పెట్టాడా లేదంటే యాదృశ్చికంగానే అలా పోస్ట్ చేసాడా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.