Sharwanand Engagement : యువ హీరో శర్వానంద్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.. అంతేకాదు శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని శర్వా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. Photo : Twitter
శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే తాజాగా ఆ అమ్మాయి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. అంతేకాదు ఈనెల 26న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రక్షితా రెడ్డితో శర్వానంద్‌కు ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి పేరు రక్షితా రెడ్డిగా తెలుస్తోంది. రక్షితా రెడ్ది తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా అని అంటున్నారు. అంతేకాదు ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. (Twitter/Photo)
రక్షిత రెడ్డి, శర్వానంద్‌ల పెళ్ళికి సంబంధించి అతి త్వరలో ఇరు కుటుంబాలు ఓ ప్రకటన విడుదలచేయనున్నాయని తెలుస్తోంది. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అతి త్వరలో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నారని తెలుస్తోంది. OTT Twitter
శర్వానంద్ సినీ కెరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. 2003లో విడుదలైన ‘ఐదో తారీఖు’ సినిమాతో వెండితెర పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తర్వాత చిరంజీవితో థమ్స్ అప్ యాడ్‌లో నటించడమే కాకుండా.. ‘శంకర్ దాదా MBBS సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. Photo : Twitter
ఆ తర్వాత వెంకటేష్‌తో ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ చిత్రాల్లో హీరో తమ్ముడు పాత్రలో నటించాడు. ఇక గమ్యం సినిమాతో తెలుగు, తమిళంలో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక అలా వరుస సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొన్ని సినిమాలతో ప్లాఫ్ లు అందుకోగా తన నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. ముఖ్యంగా ‘గమ్యం’, ప్రస్థానం, శతమానం భవతి వంటి చిత్రాలు శర్వానంద్‌కు నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. Photo : Twitter
అంతకు ముందు వెన్నెల సినిమాలో సైకో క్యారెక్టర్లో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత సరైన సక్సెస్‌లేని శర్వానంద్ ఎట్టకేలకు గతేడాది ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నాడు. 2022లో మంచి సక్సెస్‌తో ఎండ్ చేసిన ఇతను 2023లో ఒక ఇంటి వాడు కావడం ఆనందించదగ్గ పరిణామం. Photo : Twitter
ఇక శర్వానంద్.. రామ్ చరణ్‌కు క్లాస్ మేట్. ఇతనితో పాటు రానా,నవదీప్‌లు క్లాస్మేట్స్. ఇక శర్వానంద్ తాతగారు (నాన్న వాళ్ల నాన్న) మైనేని హరిప్రసాద్‌కు సీనియర్‌కు చెందిన అకౌంట్స్ గట్రా చూసేవారు. ఈ రకంగా ఇతనికి మెగా, నందమూరి కుటుంబాలతో మంచి అనుబంధమే ఉంది. అలా ఇతను సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి తనకున్న పరిచయాలతో నటుడిగా, హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. Photo : Twitter
ఇక శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం విషయానికి వస్తే.. అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అక్కినేని అమల ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. Photo : Twitter
థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక శర్వానంద్ ఇటీవలే నటించిన మరో సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. రష్మిక మందన్న హీరోయిన్గా చేసింది. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం ఇవ్వలేదు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా కణం పేరుతో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Twitter
ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఒకే ఒక జీవితం నిర్మించారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్లర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీతూ వర్మ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో రీతూ వర్మకు కూడా మంచి హిట్ పడింది. Photo : Twitter
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఒకే ఒక జీవితం మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం తెలంగాణ +ఏపీలో కలిపి రూ. 6.33 కోట్లు (రూ. 10.65 కోట్లు)కు పైగా షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.10.15 కోట్లు (రూ. 24 కోట్లు గ్రాస్) వసూళ్లను సాధించింది. Photo : Twitter
యూఎస్ఏ లో ఈ చిత్రం దాదాపు హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటింది. కలెక్షన్లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్‌తో ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందించారు దర్శకుడు కార్తిక్. ఈ సినిమా టీజర్, అమ్మ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. Photo : Twitter
‘ఒకే ఒక జీవితం’ మూవీతో శర్వానంద్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రం ద్వారా తెలుగు లోకి అడుగుపెడుతోంది, దీనికి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. తమిళంలో కణం పేరుతో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేశారు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. ఇక మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది Photo : Twitter