ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ ఫోటోషూట్ చేస్తే పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు మాత్రం అభిమానులకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో ఊహించని రీతిలో దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఈయన. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత అక్టోబర్ 15న డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ఇంటికి వెళ్లి కూడా మళ్లీ మూడు నెలలు అయిపోయింది. ఈ మధ్యే బయట కనిపిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఓ ఫోటోషూట్ చేసాడు మెగా మేనల్లుడు.
యాక్సిడెంట్లో తగిలిన గాయాలతో పాటు కాలర్ బోన్ సర్జరీ సమయంలో వచ్చిన సమస్యలతో మొన్నటి వరకు కాస్త వీక్‌గా ఉన్నాడు తేజు. అందుకే ఈయన ఫోటోలు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు తేజ్. అందుకే ఇప్పుడిప్పుడే ఫోటోలు కూడా బయటికి విడుదల చేస్తున్నారు. తాజాగా ఓ న్యూ ఫోటోషూట్ విడుదల చేసి సోషల్ మీడియాలో విడుదల చేసారు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఈయన ఆరోగ్యం కుదుట పడింది. త్వరలోనే ఈయన మళ్లీ షూటింగ్స్‌తో కూడా బిజి కానున్నాడు. ఒకేసారి రెండు సినిమాలకు కమిట్ అవుతున్నాడు సాయి. త్వరలోనే వీటి గురించి పూర్తి క్లారిటీ రానుంది. అందులో ఓ కొత్త దర్శకుడితో సినిమా ఉండబోతుంది. ఫిబ్రవరి తర్వాత సాయి తేజ్ సినిమాలు మొదలు కానున్నాయి.
ప్రస్తుతం ఈయనకు ఎలాంటి సమస్యలు లేవని.. ఫిజియో తెరపీ చేస్తుండటంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తున్నాడు తేజ్. ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ తన ఆరోగ్యంపై ట్వీట్ చేసాడు. ఇది చూసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఫోటోలు, వీడియోలలో కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు సాయి. మునపటి లుక్‌లోకి వచ్చేసాడు.
తాజాగా విడుదల చేసిన ఫోటోలో.. ఓ సారి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత నిలబడటంలో ఉన్న ధైర్యమే వేరు అంటున్నాడు తేజ్. యాక్సిడెంట్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు కానీ చాలా త్వరగానే కోలుకున్నాడు ఈయన. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం పూర్తిగా నయమైపోయింది. స్పృహలోకి రావడానికి కాస్త సమయం తీసుకున్నా తర్వాత చాలా త్వరగా సెట్ అయిపోయాడు.
దివాళి రోజు మొదటి సారి సాయి ధరమ్ తేజ్ ఫోటో బయటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడు పండగ సెలబ్రేట్ చేసుకున్నాడు సాయి. ఆ తర్వాత క్రిస్మస్ ఫోటో వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సమయంలో కూడా కుటుంబంతోనే ఉండి టైమ్ స్పెండ్ చేసాడు సాయి. ఇప్పుడు విడుదలైన ఫోటోలో పూర్తిగా పాత సాయి తేజ్ రూపంలోకి మారిపోయాడు. ఫిజిక్ కూడా బాగానే మెయింటేన్ చేస్తున్నాడు ఈయన.
వినాయక చవితి సెప్టెంబర్ 10 సాయంత్రం 8 గంటల ప్రాంతంలో దుర్గం చెరువు ఫ్లై ఓవర్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా సాయి తేజ్ బైక్ నుంచి కిందపడి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ్నుంచి ఆయన్ని మెడి కవర్ ఆస్పత్రిలో చేర్పించి కాసేపు చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు. త్వరలోనే మళ్లీ సినిమాలతో బిజీ కానున్నాడు మెగా మేనల్లుడు. ఇదే కోరుకుంటున్నారు ఫ్యాన్స్ కూడా.