సదా లేదా సదాఫ్ మొహమ్మద్ సయీద్.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది.సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టింది. ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను దోచుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సదాకు వరుస అవకాశాలు వచ్చాయి. Photo : Instagram
సదా కెరీర్లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తెలుగులో ఈ భామ‘నాగ’లో ఎన్టీఆర్ సరసన నటించింది. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో కథానాయికగా యాక్ట్ చేసింది. అయితే ఆ మధ్య ఈ భామ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. Photo : Instagram