మా ఎన్నికల తీరు.. ఇక్కడ జరుగుతున్న పోరు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ రచ్చ చూడలేక ఏకంగా చిరంజీవి సైతం సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే ఎన్నికలు జరపాలని.. ఎక్స్ ట్రాలు చేస్తున్న తోకలు కత్తిరించాలంటూ క్రమశిక్షణ సంఘానికి లేఖ కూడా రాసాడు. అయితే గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఈ సారి అధ్యక్ష బరిలో 5గురు పోటీ పడటం ఆసక్తికరంగా మారింది.
చిన్న గాయమే అయినా కూడా ఈయన హైదరాబాద్ సన్షైన్ ఆసుపత్రికి వస్తున్నాడు. ఇక్కడే ఆయనకు సర్జరీ జరగనుంది. చేతికి చిన్న ఫ్రాక్చర్ కావడంతో చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్నాను.. ఇక్కడ తన స్నేహితుడు డా.గురవారెడ్డి సర్జరీ చేయనున్నారని తెలిపాడు ప్రకాశ్ రాజ్. అయితే ఈయనకు నిజంగా గాయమైందా లేదంటే మా ఎన్నికల కోసమే హైదరాబాద్ వస్తున్నారా అనే వాదన కూడా ఇప్పుడు మొదలైంది.
గాయాల పాలవ్వడం నిజమే.. అయితే హైదరాబాద్ మాత్రం కావాలనే వస్తున్నట్లు తెలుస్తుంది. చెన్నైలోనే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.. అంత చిన్న సర్జరీ కోసం ఇంతదూరం రావాల్సిన అవసరం లేదు కదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్కు వస్తే సర్జరీ జరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు ఉండొచ్చు.. స్వామి కార్యం స్వకార్యం రెండూ పూర్తవుతాయనేది ప్రకాశ్ రాజ్ ఆలోచనలా కనిపిస్తుంది.