ఆడవాళ్ల నోట్లో రహస్యాలు దాగవంటారు. అందుకే బిబిసి కంటే ఫాస్టుగా అక్కడ న్యూస్ షేర్ అవుతుందని జోకులు కూడా వేస్తుంటారు. ఇప్పుడు మరోసారి అది నిజమే అని నిరూపించింది హీరోయిన్ నిధి అగర్వాల్. కెరీర్లో మొదటిసారి పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో నటిస్తున్న ఆనందమో ఏమో తెలియదు కానీ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అసలు కథ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో ఉన్న మెయిన్ ట్విస్ట్ బయటపెట్టింది.
దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమెపై ట్రోలింగ్ జరగడమే కాకుండా.. పవన్ అభిమానులు ఈమెపై ఫైర్ అవుతున్నారు. అంత పెద్ద సినిమాలో నటిస్తున్నపుడు కనీసం నోరు కంట్రోల్లో ఉండకపోతే ఎలా అంటూ నిలదీస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా షూటింగ్స్ పూర్తి చేసే దర్శకులలో క్రిష్ ముందుంటాడు. అనుకుంటే పూరీ జగన్నాథ్ కంటే వేగంగా ఈయన సినిమాలు పూర్తి చేస్తుంటాడు.
వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలంను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను కేవలం 79 రోజుల్లోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే 40 శాతానికి పైగానే పూర్తయింది. క్రిష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. 100 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం.
పవన్ కెరీర్లో కూడా హైయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇదే. పైగా ఈయన చేస్తున్న తొలి హిస్టారికల్ సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో అధికంగానే ఉండబోతున్నాయి. 16వ శతాబ్ధపు కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో బందిపోటుగా నటిస్తున్నాడు పవన్. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ హరి హర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. కోహినూర్ డైమండ్ కథతో ఈ సినిమా వస్తుంది.
ఈ సినిమాను కూడా త్వరగానే పూర్తి చేయాలనుకున్నా.. మధ్యలో భీమ్లా నాయక్ రావడంతో కొన్ని రోజులు వాయిదా వేసారు. మరోవైపు కోవిడ్ కారణంగా ఇంకొన్ని రోజులు వాయిదా పడింది. దాంతో అనుకోని విధంగా సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. మరోవైపు హరిహర వీరమల్లులో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలానే ఉన్నాయి.. దానికితోడు విజువల్ ఎఫెక్ట్స్‌తో పని ఉంది.
రెండు వేర్వేరు కాలాల మధ్య ఈ కథ సాగుతుందనే ట్విస్ట్ బయటపడటంతో పవన్ ఫ్యాన్స్.. వీరమల్లు ఎలా ఉండబోతున్నాడో అంటూ ఇప్పట్నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి తర్వాతే మొదలు కానుంది. ఎప్రిల్ 29న సినిమా విడుదల కానుందని ముందు చెప్పారు కానీ మరోసారి వాయిదా పడటం ఖాయం అయిపోయింది. త్వరలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.