ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ చైనా లాంటి దేశాలు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇద్దరు చాలు.. ముగ్గురు వద్దులే అంటూ ఇప్పుడు అంతా ఫాలో అయిపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఇద్దరు పిల్లలు చాల్లే అనుకుంటున్నారు. మహా అయితే మరొకరు అంతే.. అక్కడి కంటే వద్దు అని నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కానీ మంచు విష్ణు మాత్రం ఏకంగా నలుగురు పిల్లల తండ్రి అయిపోయాడు.
అందులో ఒసారి కవల పిల్లలు కూడా. దాంతో ఈయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. క్రికెట్ టీం కానీ ప్లాన్ చేస్తున్నావా విష్ణు అంటూ సెటైర్లు వేసారు కొందరు. అయితే అవన్నీ కామన్ అంటూ కొట్టి పారేసాడు విష్ణు. తన సొంత నిర్ణయాల గురించి బయట వాళ్లు ఏమనుకున్నా కూడా తాను పట్టించుకోనని ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు విష్ణు.
మరోవైపు మంచు విష్ణు కూడా మా ఎన్నికల కారణంగా బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఈ ప్రోమోలో పర్సనల్ విషయాలనే చాలా సరదాగా అడిగాడు అలీ. ముఖ్యంగా పిల్లల గురించి కూడా ప్రశ్నించాడు. ఏంటి అంతా ఒక్కరు ఇద్దరూ అంటుంటే.. నువ్వేమో నలురురిని దించేసావ్.. ఇంకా ప్లాన్ చేస్తున్నావా అంటూ అడిగేసాడు అలీ. దానికి మంచు విష్ణు కూడా చాలా సరదాగా సమాధానమిచ్చాడు.