ప్రభాస్ గురించి ఇప్పుడు ఏదైనా విషయం తెలిస్తే అది పాన్ ఇండియన్ న్యూస్ అయిపోతుంది. ఎందుకంటే అన్నిచోట్లా ప్రభాస్‌కు ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇలాంటి హీరో గురించి చాలా విషయాలను అభిమానులతో పంచుకుంది ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి. అందులో ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు మోస్ట్ ఇంట్రెస్టెడ్ పెళ్లి విషయం కూడా ఉంది. అయినా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ప్రభాస్ పెళ్లి.
ఈయన పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దానికి తోడు ఈయన పెళ్లి టాపిక్ కూడా డైలీ సీరియల్స్ కంటే దారుణంగా సాగుతుంది. ఏళ్లకేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చడం లేదు. ఎప్పుడు ఎక్కడ దొరికినా కూడా ప్రభాస్ పెళ్లి ముచ్చట ట్రెండింగ్‌లోనే ఉంటుంది. దాంతో పాటే ఇంకా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది శ్యామలా దేవి.
ప్రభాస్‌ను పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా తప్పించుకుంటూనే ఉంటాడు. ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ఆ మధ్య మీడియాతో ముచ్చటించారు. దాంతో మరోసారి ఈయన పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ అయిపోయింది. ఐదేళ్ళ కింద అంటే బాహుబలి అన్నాడు.. ఆ తర్వాత అడిగితే అది పూర్తయ్యాక అన్నాడు.. బాహుబలి అయిన తర్వాత సాహో అన్నాడు.. ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు.
దాంతో పాటు మరో నాలుగు సినిమాలు లైన్లోనే ఉన్నాయి. ప్రభాస్ వయసు ఇప్పటికే 40 దాటేసింది. అయినా కూడా పెళ్లి వైపు చూడటం లేదు ఈ హీరో. త్వరలోనే పెళ్లి కన్ఫర్మ్ అని ఎప్పటికప్పుడు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి తాము కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నామని.. అతడి పెళ్లిపై వచ్చే వార్తలను తాము సరదాగా తీసుకుంటామని చెబుతుంది శ్యామలా.
అది చూసి నవ్వుకోవడం కూడా అలవాటు చేసుకున్నామని చెబుతున్నారు కృష్ణంరాజు సతీమణి. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తైన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు చెప్పింది ఈమె. అంతేకాదు.. తన పెదనాన్న కృష్ణంరాజుని పెద్ద బాజీ అని.. తనను కన్నమ్మ అని ప్రేమగా పిలుస్తాడని ఆమె చెప్పింది. తమ ఫోన్ నెంబర్లు కూడా అతడి మొబైల్లో ఈ పేర్లతోనే సేవ్ అయ్యుంటాయని చెప్పింది ఈమె.
తమది చాలా పెద్ద కుటుంబం అని.. అందరిలో కలిసిపోయే అమ్మాయే కావాలని చెప్పింది శ్యామలా దేవి. పైగా ప్రభాస్ కూడా తన కూతుళ్లను సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువగా చూసుకుంటాడని.. అంతా కలిసి ఉంటారని చెప్పుకొచ్చింది శ్యామలా దేవి. అందుకే అలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నామని.. దొరికినపుడు కచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చెప్పారు శ్యామలా దేవి.