Aditya 999: ఆదిత్య 999పై బాలకృష్ణ క్లారిటీ.. కానీ ఓ ట్విస్ట్.. ఆయన కోసం కాదట..!
Aditya 999: ఆదిత్య 999పై బాలకృష్ణ క్లారిటీ.. కానీ ఓ ట్విస్ట్.. ఆయన కోసం కాదట..!
Aditya 999 | Balakrishna | నందమూరి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆదిత్య 999 మూవీపై అప్డేట్ వచ్చేసింది. స్వయంగా బాలకృష్ణే దీనిపై ప్రకటన చేశారు.
1991లో విడుదలైన ఆదిత్య 369 ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. అప్పట్లోనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చి టాలీవుడ్‌ను షేక్ చేసింది. సింగీతం శ్రీనివాస రావు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఐతే ఆదిత్య 369 మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
2/ 7
ఆదిత్య 999 మూవీని చేస్తామని గతంలో బాలకృష్ణ కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా.. ఆదిత్య 999పై మాత్రం మాట్లాడలేదు. ఐతే ఎట్టకేలకు ఈ చిత్రంపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 999 ఖచ్చితంగా ఉంటుందని ప్రకటించారు.
3/ 7
శుక్రవారం యంగ్ హీరో విశ్వసన్ హీరో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన మూవీ దాస్ కా దమ్కీ చిత్ర ట్రయలర్‌ను బాలకృష్ణ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఆదిత్య 999 ఉంటుందని స్పష్టం చేశారు.
4/ 7
వచ్చే ఏడాది ఆదిత్య 999 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తానని చెప్పడంతో.. బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
5/ 7
ఆదిత్య 999 గురించి మరో ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ నటించరని.. ఇది తన కుమారుడు మోక్షజ్ఞ కోసమే తీస్తున్నారని సమాచారం. ఆదిత్య 999 మూవీతో మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గ్రాండ్‌గా ఉండేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారట.
6/ 7
టైమ్ ట్రావెల్ కాన్పెప్ట్‌తో ఈ మధ్య వరుసగా సినిమాలు వస్తున్నాయి. అద్భుతం, బింబిసార, ఒకే ఒక జీవితం, బెనారస్ వంటి చిత్రాలు ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. బాలకృష్ణ ప్రకటనతో ఆదిత్య 999 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.
7/ 7
బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి మూవీలో నటిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.