క మార్చిలో ఆర్ఆర్ఆర్.. తెలుగులో బాహుబలి 2 అన్ని రికార్డులను క్రాస్ చేసింది. ఇక ఏప్రిల్‌లో డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ 2 తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ స్టేటస్ అందుకుంది. ఇక మే నెలలో సర్కారు వారి పాట, ఎఫ్ 3 అబౌ యావరేజ్‌గా నిలిచాయి. మరోవైపు జూన్‌లో మేజర్, విక్రమ్ సినిమాలు హిట్ అందుకున్నాయి. ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’, చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు డిజాస్టర్ జాబితాలో చేరాయి. (Twitter/Photo)
క మార్చిలో ఆర్ఆర్ఆర్.. తెలుగులో బాహుబలి 2 అన్ని రికార్డులను క్రాస్ చేసింది. ఇక ఏప్రిల్‌లో డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ 2 తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ స్టేటస్ అందుకుంది. ఇక మే నెలలో సర్కారు వారి పాట, ఎఫ్ 3 అబౌ యావరేజ్‌గా నిలిచాయి. మరోవైపు జూన్‌లో మేజర్, విక్రమ్ సినిమాలు హిట్ అందుకున్నాయి. ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’, చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు డిజాస్టర్ జాబితాలో చేరాయి. (Twitter/Photo)
1945 | జనవరి 7న ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్లో రిలీజ్ చేశారు. ముఖ్యంగా సినిమాను చూసిన ప్రేక్షకులు.. క్లైమాక్స్ లేని సినిమా ఏంటంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తూ ఆడియన్స్ తిట్టుకున్నారు.ఈ సినిమాను రానా కూడా ప్రమోట్ చేయలేదు. రెండు రోజులకు కలిపి ఈ సినిమా కనీసం 10 లక్షల షేర్ కూడా తీసుకురాలేదంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రానా సినిమాలకు ఇంత కంటే దారణమైన అవమానం మరోటి ఉండదేమో..? చాలా చోట్ల నెగిటివ్ షేర్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా ఫుల్ రన్ కలిపి కనీసం 15 లక్షల మార్క్ కూడా అందుకోకపోవడం చెప్పుకోదగ్గ అంశం. (Twitter/Photo)
సాధారణంగా ఫిబ్రవరిని సినిమా ఇండస్ట్రీకి అన్ సీజన్ అంటారు. కానీ కొన్నేళ్లుగా అలాంటివేం పట్టించుకోకుండా తమ సినిమాలను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వీలైనంత వరకు మంచి డేట్స్ దొరికితే చాలు.. రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. నిజానికి ఫిబ్రవరిలో ఆచార్య, ఎఫ్ 3 లాంటి సినిమాలు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దాంతో రవితేజ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు ఈ ఫిబ్రవరిని తమ సినిమాలతో నింపేసారు. కరోనా వైరస్ మెల్లగా తగ్గుముఖం పట్టిన తర్వాత రవితేజ ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ తర్వాత వరసగా వారానికి రెండు మూడు సినిమాలు వచ్చాయి. చివర్లో భీమ్లా నాయక్ కూడా సందడి చేసింది. మరి ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలెన్ని.. అందులో విజయాలు ఎన్ని..?
ఖిలాడి: రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన సినిమా ఖిలాడి. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ ఊహించినంతగా రాలేదు. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రానికి ఫైనల్‌గా 13 కోట్లు మాత్రమే వచ్చాయి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ఇందులో హీరోయిన్లుగా నటించారు.
డిజే టిల్లు: రవితేజ సినిమాకు పోటీగా వచ్చిన డిజే టిల్లు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. పెద్దగా సందడి లేకుండా వచ్చిన టిల్లు భాయ్ మంచి లాభాలు తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఫిబ్రవరిలో మొదటి హిట్ స్టేటస్‌ను దాటి ‘బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు.
భీమ్లా నాయక్: ఫిబ్రవరిలో వచ్చిన అతిపెద్ద సినిమా భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రం మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్.. 70 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫిబ్రవరిలో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా భీమ్లా నాయక్ రికార్డులు తిరగరాసింది. మొత్తంగా ఫిబ్రవరి టీజే టిల్లు బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. భీమ్లా నాయక్ అబౌ యావరేజ్‌గా నిలిచింది.
March Movies in 2022 : జనవరి అంతా ఓమిక్రాన్ వేరియంట్ సినీ ఇండస్ట్రీని కలవరపాటుకు గురిచింది. ఆ తర్వాత కరోనా వైరస్ మెల్లగా తగ్గుతుండటంతో సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల కావడం.. దానికి అదిరిపోయే కలెక్షన్స్ రావడంతో మిగిలిన నిర్మాతలు కూడా ధైర్యం చేసారు. మార్చ్ అయితే పెద్ద సినిమాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఇదే నెలలో రిలీజైయ్యాయి. అందులో రాజమౌళి ట్రిపుల్ ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరోవైపు తమిళం, కన్నడలలో కూడా భారీ సినిమాలు వచ్చాయి. మార్చ్ 4 నుంచి 25 వరకు వరసగా సినిమాలు థియేటర్స్‌లో విడుదలయ్యాయి. . ఇందులో ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి మార్చి నెలకు ఘనంగా వీడ్కోలు పలికింది.
ఆడవాళ్లు మీకు జోహార్లు: శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ సినిమాను మార్చ్ 4న విడుదలైంది. మిక్స్డ్ టాక్.. పైగా డైలీ సీరియల్‌కు సీక్వెల్‌గా ఉందన్నఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 16 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 7.72 కోట్ల షేర్ రాబట్టింది. బయ్యర్స్‌కు రూ. 8 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి మార్చి నెలలో తొలి ఫ్లాప్‌గా నిలిచింది.
రాధే శ్యామ్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఈ చిత్రం మార్చ్ 11న విడుదలైంది. క్లాస్ లవ్ స్టోరీగా రిచ్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొత్తంగా రూ. 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 84.70 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 120 కోట్లు నస్టాలతో మన దేశంలోనే 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
జేమ్స్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్. ఈ సినిమాను ఆయన జయంతి సందర్భంగా మార్చ్ 17న విడుదలైంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఒకేరోజు విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. తెలుగులో మిగిలిన భాషల్లో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. (Twitter/Photo)
ట్రిపుల్ ఆర్: మోస్ట్ ప్రజ్టేజియస్ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశమే హద్దుగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం ఆరు రోజుల్లో ఈ సినిమా 371.37 కోట్లు షేర్ (రూ.670కోట్ల గ్రాస్) వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ముఖ్యంగా నార్త్ సౌత్, ఈస్ట్ , వెస్ట్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. (Twitter/Photo)
April Most Awaited Movies : టాలీవుడ్ ఇపుడిపుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఒకప్పటి వైభవాన్ని మళ్లీ అందుకుందనే చెప్పాలి. ఫిబ్రవరి రిలీజై ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు మంచి వసూళ్లనే సాధించాయి. ఇక మార్చిలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఫైనల్‌గా తేలిపోయింది. ఇక మార్చి చివరి వారంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో థియేటర్స్ దగ్గర జనాలు పోటెత్తారు. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు వరకు చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఏప్రిలో నెలలో ఇప్పటికే ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ఒకటి రెండు సినిమాలు విడులయ్యాయి. కానీ కేజీఎఫ్ 2 సినిమా తెలుగు డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక నెల చివరల్లో చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఆచార్యతో పలకిరించారు. ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా ఏప్రిల్ నెల బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికొస్తే..
గని | ఇక ఏప్రిలో నెలలో ఇప్పటికే ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ఒకటి రెండు సినిమాలు విడులయ్యాయి. ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’తో మూవీ విడుదలైంది. ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్, కేజీఎప్ 2 సినిమాలు పెద్ద దెబ్బ వేసాయి. పైగా ఎలాంటి బజ్ లేకుండా విడుదలైన ఈ సినిమా ఓ వారంలోనే చాప చుట్టేసింది. ఈ సినిమా రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. మొత్తంగా రూ. 5 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
బీస్ట్ | విజయ్ హీరోగా నటించిన ఈ డబ్బింగ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏప్రిల్ 13న పలకరించనుంది. ఈ సినిమాలో విజయ్ ఏజెంట్ వీరరాఘవ పాత్రలో నటించారు. పూర్తి యాక్షన్ అండ్ కామెడీ మరియు దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. మొత్తంగా ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. (Twitter/Photo)
కెజియఫ్ ఛాప్టర్ 2 | కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ. ఈ చిత్రం మొదటి భాగం కేజీఎఫ్ చాఫ్టర్ 1తో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అంతేకాదు రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరిన మూడో సౌత్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక నెల గ్యాప్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. (kgf chapter 2)
ఆచార్య | చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్యలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ద అనే కామ్రేడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 75 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
మొత్తంగా ఏప్రిల్‌లో గని, ఆచార్య, వంటి తెలుగు చిత్రాలతో పాటు బీస్ట్, కేజీఎప్ ఛాప్టర్ 2 వంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేసాయి. వీటిలో యశ్, ప్రశాంత్ నీల్ల కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కేజీఎఫ్ 2’ మాత్రమే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మొత్తంగా తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా కేజీఎప్ 2 దేశ్ కా బాక్సాఫీస్ కా బాద్షా అనిపించుకున్నాడు. (Twitter/Photo)
సర్కారు వారి పాట | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేసారు. ఈ సినిమా మే 12న విడుదలైన మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రూ. 110.12 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు రూ. 10.88 కోట్ల దూరంలో ఆగిపోయింది. అంతేకాదు మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా 91 శాతం రికవరీ పూర్తి చేసుకొని అబౌ యావరేజ్ మూవీగా నిలిచింది. . Mahesh Babu Photo : Twitter
కాలేజ్ డాన్ | శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలేజ్ డాన్’. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. సర్కారు వారి పాట సినిమాకు పోటీగా విడుదలైన ఈ సినిమా తెలుగులో సైలెంట్ కిల్లర్‌గా హిట్ స్టేటస్ అందుకుంది.తెలుగులో ఈ సినిమా రూ. 1.3 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలో దిగి ఓవరాల్‌గా రూ. 1.75 కోట్లు రాబట్టి.. తెలుగులో రూ. 25 లక్షలకు పైగా లాభాలను తీసుకొచ్చి క్లీన్ హిట్‌గా నిలిచింది.
F3 | విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘F3’. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాపై టాలీవుడ్లో ఎన్నో అంచనాలున్నాయి. దిల్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా మే 27న విడుదలై అబౌ యావరేజ్‌గా నిలిచింది. (Twitter/Photo)
మేజర్ | అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మేజర్’. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 30 కోట్ల షేర్ ( రూ. 60 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా పెట్టిన పెట్టుబడికి డబుల్ లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
విక్రమ్ | కమల్ హాసన్ ముఖ్యపాత్రలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ విక్రమ్. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా నాలుగు రోజుల్లో లాభాల్లోకి వచ్చింది. దాదాపు విశ్వరూపం తర్వాత తమిళం, తెలుగులో ఈ సినిమాతో హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఈ సినిమా నాల్గు రోజుల్లో రూ. 7.50 కోట్లను రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. తెలుగులో రూ. 17 కోట్ల షేర్.. (రూ. 30 కోట్ల గ్రాస్) ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల షేర్ (రూ. 400 కోట్ల గ్రాస్ ) వసూళ్లను సాధించింది. . (Twitter/Photo)
మొత్తంగా ఆరు నెలల్లో జనవరిలో ‘బంగార్రాజు’ మూవీతో నాగార్జున, నాగ చైతన్య సక్సెస్ అందుకున్నారు. ఫిబ్రవరి సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘టీజే టిల్లు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అటు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ మూవీ అబౌ యావరేజ్‌గా నిలిచింది. మార్చి నెలలో డబ్బింగ్ చిత్రం ‘జేమ్స్’ మంచి వసూళ్లనే దక్కించుకుంది. చివరిగా వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఏప్రిల్‌లో డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ 2 హిట్ స్టేటస్ అందుకుంది. మే నెలలో కాలేజ్ డాన్ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇక జూన్ నెలలో మేజర్, విక్రమ్ సినిమాలు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఫిబ్రవరి ‘రాధే శ్యామ్’. ఏప్రిల్ లో విడుదలైన చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ మాత్రం టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ మూవీస్‌గా నిలిచాయి. 'భీమ్లా నాయక్’, సర్కారు వారి పాట’ ఎఫ్ 3 మూవీలు అబౌ యావరేజ్‌గా నిలిచాయి. (Twitter/Photo)