Month Wise Top Tollywood Highest Share Movies : 2022లో ఫిబ్రవరిలో విడుదలైన ‘భీమ్లా నాయక్’ మూవీ టాలీవుడ్లో ఆ నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత మార్చి నెలలో ఆర్ఆర్ఆర్ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో అగ్ర స్థానంలో ఉంది. తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ మే నెలలో టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఎన్నో ప్లేస్‌లో ఉందంటే. (Twitter/Photos)
జనవరి | ‘అల వైకుంఠపురములో’ | ఒకప్పటితో పోల్చుకుంటే.. సినిమా టికెట్స్ రేట్స్‌లో పెరుగుదల కారణంగా ప్రతి యేడాది ఈ ర్యాంక్స్ ఛేంజ్ అవుతూ ఉంటాయి. ఇక 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ల ‘అల వైకుంఠపురములో’ సినిమా.. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ. 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2020లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాదు జనవరి నెలలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
భీమ్లా నాయక్ - ఫిబ్రవరి | టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఫిబ్రవరి డల్ సీజన్ అనే చెప్పాలి. ముఖ్యంగా పరీక్షల సీజన్ కావడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సంకోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అన్ సీజన్లో మహా శివరాత్రి కానుకగా ‘భీమ్లా నాయక్’ సినిమాను విడుదల చేసారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే సాధిస్తోంది. అంతేకాదు గతంతో పోల్చకుంటే ఫిబ్రవరి నెలలో అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రంగా ‘భీమ్లా నాయక్’ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 81.50 కోట్ల వరకు షేర్..వసూళ్లు రాబట్టింది. (Twitter/Photo)
మార్చి - ఆర్ఆర్ఆర్ | ఆర్ఆర్ఆర్ మూవీ రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ సినిమా మార్చి నెలలో అత్యధిక వసూళ్లు సాధించే సినిమాగా రికార్డులకు ఎక్కనుంది. ఓవరాల్‌గా మొదటి రోజు రూ. 135 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 270 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో రూ. 303 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 613.06 కోట్ల షేర్ రాబట్టి(Twitter/Photo)
ఏప్రిల్ - బాహుబలి 2 | 2017లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం దాదాపు రూ 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగులో ఈ సినిమా రూ. 325 కోట్ల షేర్ సాధించింది. మిగతా అన్ని భాషల్లో కలిపి రూ. 831 కోట్ల షేర్ సాధించింది. 2017 హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఏప్రిల్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. (Twitter/Photo)
మే - సర్కారు వారి పాట | మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా మే నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. నిన్నటి వరకు ఈ లిస్టులో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా ఉంది. ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను సర్కారు వారి పాట దాటింది. ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా థియేట్రికల్ రన్ మగిసింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రూ. 110.12 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు రూ. 10.88 కోట్ల దూరంలో ఆగిపోయింది.(Twitter/Photo)
జూలై - బాహుబలి | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సిరీస్‌లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా దాదాపు రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను అన్ని భాషల్లో కలిసి సాధించింది. తెలుగులో రూ. 191 కోట్ల షేర్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఓవరాల్‌గా రూ. 311 కోట్ల షేర్ సాధించి 2015 హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాదు జూలై నెలలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
ఆగష్టు - సాహో | 2019 - సాహో | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ మూవీ అన్ని భాషల్లో కలిపి రూ. 218.45 కోట్ల వసూళ్ల షేర్ సాధించింది. తెలుగులోఈ మూవీ రూ. 90 కోట్ల షేర్ సాధించింది. ఈ మూవీకి హిందీలో మంచి వసూళ్లు దక్కడం విశేషం. 2019లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాదు ఆగష్టు నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
సెప్టెంబర్ - జనతా గ్యారేజ్ | ఎన్టీఆర్ హీరోగా మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ మూవీ ఓవరాల్‌గా రూ. 80.05 కోట్ల షేర్ సాధించి 2016 హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసుకుంది. (Twitter/Photo)
అక్టోబర్ సైరా నరసింహా రెడ్డి | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సురేందర్ రెడ్డి దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో కలిపి రూ. 187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అక్టోబర్‌లో రిలీజైన మూవీస్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
నవంబర్ - డమరుకం | నాగార్జున హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. కానీ ఓవరాల్‌గా రూ. 36 కోట్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. నవంబర్‌లో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
డిసెంబర్ - పుష్ప | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం 2021 యేడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 145 కోట్లకు పైగా షేర్ సాధించి 2021లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవడంతోపాటు డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా తన పేరిట రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రూ. 365 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. (Twitter/Photo)