Tollywood 1st Week Highest share Movies : పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే రికార్డుల పర్వం మొదలవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీతో మరోసారి అది ప్రూవ్ అయింది. దీంతో ఇదివరకు రికార్డు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫస్ట్ వీక్‌లో రూ. 25 కోట్లు వసూలు చేస్తే ఎక్కువగా అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఫస్ట వీక్‌లోనే దాదాపు రూ. 50 కోట్లకు పైగా షేర్ అనేది ఈజీ అయిపోయింది. రూ. 100 గ్రాస్ వసూళ్లను ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. మొత్తంగా ఫస్ట్ వీక్‌లో టాలీవుడ్లో టాప్ షేర్ సాధించిన సినిమాల విషయానికొస్తే..
7. భీమ్లా నాయక్: కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. ఇప్పుడు పవన్ సినిమాకు మొదటి రోజు తక్కువ వసూళ్లు రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది ఏపీలో టికెట్ రేట్స్. ఈ కారణంగానే భీమ్లా నాయక్ మొదటి రోజు 26.42 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమా ఫస్ట్ వీక్.. రూ. 70.40 కోట్ల షేర్ సాధించింది. (Twitter/Photo)