Tollywood 1st Week AP - TG Highest share Movies : పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే రికార్డుల పర్వం మొదలవుతోంది. ఈ సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్య’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాయ చేసాయి. దీంతో ఇదివరకు రికార్డు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫస్ట్ వీక్‌లో రూ. 25 కోట్లు వసూలు చేస్తే ఎక్కువగా అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఫస్ట వీక్‌లోనే దాదాపు రూ. 50 కోట్లకు పైగా షేర్ అనేది ఈజీ అయిపోయింది. రూ. 100 గ్రాస్ వసూళ్లను ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. (Twitter/Photo)
2. బాహుబలి 2: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ. 43 కోట్లు షేర్ వసూలు చేసింది. ఫస్ట్ డే వీక్ రూ. 117.92 కోట్ల షేర్ సాధించి ఆర్ఆర్ఆర్ విడుదలకు వరకు టాప్ ప్లేస్‌లో కొనసాగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి 2ను రెండో ప్లేస్‌లోకి నెట్టెసింది. (File/Photo)
5. సైరా నరసింహారెడ్డి: చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా మొదటి రోజే రూ. 38.75 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ సినిమాపై అంచనాల దృష్ట్యా సైరా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది.ఈ సినిమా ఫస్ట్ వీక్ ఏపీ, తెలంగాణలో రూ. 84.49 కోట్ల షేర్ సాధించి ఐదో ప్లేస్‌లో నిలిచింది. (File/Photo)
9.వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ గత సినిమా వకీల్ సాబ్ కూడా రికార్డులు తిరగరాసింది. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.24 కోట్లు వసూలు చేసింది. అప్పుడే కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో ఫస్ట్ వీక్ ఏపీ, తెలంగాణలోకలిపి రూ. 72.28 కోట్ల షేర్ సాధించింది. ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. (Twitter/Photo)
10. భీమ్లా నాయక్: కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. ఇప్పుడు పవన్ సినిమాకు మొదటి రోజు తక్కువ వసూళ్లు రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది ఏపీలో టికెట్ రేట్స్. ఈ కారణంగానే భీమ్లా నాయక్ మొదటి రోజు 26.42 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమా ఫస్ట్ వీక్.. రూ. 70.40 కోట్ల షేర్ సాధించింది. తాజాగా 10వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో వాల్తేరు వీరయ్య.. సూపర్ హిట్‌గా నిలిస్తే.. వీరసింహారెడ్డి హిట్‌గా నిలిచింది. మొత్తంగా కలెక్షన్స్ విషయంలో 2023 సంక్రాంతిలో బాలయ్యపై చిరు పై చేయి సాధించాడనేది వీటికి వచ్చిన వసూళ్లను చూస్తే స్పష్టమవుతోంది. (Twitter/Photo)