ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే... ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టనుంది.. ఇక రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8:19 గంటలకు టైటిల్, మధ్యాహ్నం 3:06 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటన చేసింది.. Photo : Twitter.
దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అది అలా ఉంటే RC15 వచ్చే సంక్రాంతి సీజన్లో థియేట్రికల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించారు.. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. Photo : Twitter
ఈమూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సేనాని, సేనాపతి, CEO, సైనికుడు. ఈ నాలుగు పరిశీలనలో ఉన్నాయట. అంతేకాదు ఈ నాలుగు టైటిల్స్‌ను రిజీస్టర్ చేయించారట టీమ్. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ నాలుగు టైటిల్స్‌లో CEOకే దర్శక నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి అంజలి జోడిగా కనిపించనుందట.. Photo : Twitter
టీమ్ ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తుందట. ఈ పాటకు దాదాపుగా 5 కోట్లపైగా ఖర్చు చేస్తున్నాట. అయితే ఈ పాట కోసం రామ్ చరణ్ చేసిన 80 సెకన్ల డాన్స్ సినిమాకు హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. సింగిల్ టేక్‌లో రామ్ చరణ్ అదరగొట్టేశారనీ.. చరణ్ డాన్స్‌కు శంకర్ ఫిదా అయ్యారని, థియేటర్స్‌లో ఈ మూమెంట్ కన్నుల పండగగా ఉండనుందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ పాట షూటింగ్ ఇటీవలే హైదరరాబద్లో జరిగింది. ఇక గతంలో కూడా ఓ పాట కోసం దాదాపుగా రూ.15 కోట్ల ఖర్చు చేశారని సమాచారం. ఈ విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ.. రెండు పాటలకు పెట్టే ఖర్చు ఓ మీడియం బడ్జెట్ సినిమా తీయోచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలో మరో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 కోసం చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ నెల రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ జరుపునున్నారట. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ షురూ కానుంది. Photo : Twitter
ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో సీనియర్ నటి ఖుష్బూ నటించనుందట. సెకండ్ హాఫ్‌లో ఓ కీలకమైన సన్నివేశంలో నటి ఖుష్బూ కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని సమాచారం. ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్.. రామ్ చరణ్ డ్యుయల్ రోల్లో కనిపించనున్నారు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపంచనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. Photo : Twitter
మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచి లీకులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే ఓ వీడియో, ఫోటోలు లీక్ అవ్వగా.. ఇక తాజాగా మరికొన్ని లీక్ అయ్యినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి. Photo : Twitter
గతం రామ్ చరణ్ రిక్షా తొక్కుకుంటూ తెల్లని దుస్తుల్లో ఒక కామన్ మ్యాన్ కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇక మరో ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మాత్రం పంచ కట్టులో తన భార్య కొడుకుతో కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే.. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రిగానూ అలాగే ఆ తర్వాత కొడుకు గానూ కనిపిస్తాడని, రెండు పాత్రల్లో చరణ్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక అంజలి ఈ సినిమాలో సీనియర్ రామ్ చరణ్‌కు భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దర్శకుడు. నటుడు ఎస్ జే సూర్య నటించనున్నారట. దీనికి సంబంధించి టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేయనున్నారు. నవంబర్‌లో షురూ కానున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. సినిమాలో హీరోయిన్, ఇతర టెక్నికల్ విషయాలను త్వరలో ప్రకటించనుంది టీమ్. Photo : Twitter
ఇక రామ్ చరణ్ లైనప్ విషయానికి వస్తే.. శంకర్ సినిమాతో పాటు లోకేష్ కనకరాజ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా, సుకుమార్‌తో మరో సినిమా ఇలా భారీగా ప్లాన్ చేశారు రామ్ చరణ్.. ఇవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. వీటితో పాటు ఆయన మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. మఫ్టీ చిత్రంతో కన్నడ చిత్రసీమలో మంచి పేరు తెచ్చుకున్న నర్తన్ తో రామ్ చరణ్ ఓ చిత్రాన్నియనున్నారట. ఈ విషయంలో అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. Photo : Twitter
రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియందికాదు. ఈ సినిమా గత ఏడాది మార్చిలో విడుదలై కలెక్షన్స్ పరంగానే కాకుండా రివార్డ్‌లు అవార్డ్‌ల పరంగా అదరహో అనిపిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. Photo : Twitter
ఇక అక్కడి మీడియా టాక్ ఈసీ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ.. రామ్ చరణ్ మరోసారి తన హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని.. రెండు మూడు నెలల్లో ఓ గుడ్ న్యూస్ రానుందని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇది విన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. Photo : Twitter
అది అలా ఉంటే షారుఖ్ ఖాన్ లేటెస్ట్ సినిమా జవాన్‌లో రామ్ చరణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. జవాన్ దర్శక నిర్మాతలు ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం మొదట తలపతి విజయ్, అల్లు అర్జున్‌లను సంప్రదించారట. అయితే వారు వివిధ కారణాలతో నో చెప్పడంతో రామ్ చరణ్‌ను సంప్రదించారట. కాగా రామ్ చరణ్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. షారుఖ్ కోసం ఈ సినిమాను రామ్ చరణ్ చేస్తు్న్నట్లు టాక్. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన కూడా రానుందని అంటున్నారు.Photo : Twitter
ఇక ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఇక ఈ మూవీ నుండి కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచింది. ఈ అవార్డుల ప్రధానం మార్చి 12న జరుగనుంది. దీంతో రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఇప్పటికే అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానం మార్చి 12నకానుంది. Photo : Twitter.