టిక్ టాక్ లో దుర్గారావు అంటే పరిచయం అక్కర్లేని పేరు. దుర్గారావు నాట్య మండలి పేరుతో దుర్గారావు దంపతులు చేసే డాన్సులు చాలా ఫేమస్ అయ్యాయ. టిక్ టాక్ లో వీరిద్దరికీ మంచి పేరుంది. దుర్గారావు దంపతులకు టిక్ టాక్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. వీరికి టిక్ టాక్ ముసే నాటికి కొన్ని మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. కాగా పలాస చిత్రంలోనే "నాది నక్కిలీసు గొలుసు" పాటలో దుర్గరావు చేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి.
అంతేకాదు దుర్గారావును ఇమిటేట్ చేస్తూ ఢీ షోలో పండు టీమ్ డాన్స్ చేసి తెగ ఫేమస్ చేసేసింది. ఇటీవల సుడిగాలి సుధీర్, దుర్గరావు దంపతులను కలిసి జబర్దస్త్ లో ఎంట్రీ జరిగేలా ప్లాన్ చేశాడు. ఈ లోగా జీ తెలుగు అదిరింది షోలో కూడా మొదటి సారిగా దుర్గరావు బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలాగే జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో దుర్గరావు దంపతులు ఇద్దరూ కాసేపు కనిపించి సందడి చేశారు.
ఆ తర్వాత యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రాంతో పాటు, మల్లెమాల దసరా ఈవెంట్ లో కూడ కనిపించారు. ఇక యూట్యూబులో లో దుర్గారావు దంపతులు మంచి వ్యూస్ సాధిస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనలు ముగిసినప్పటి నుంచి ఈవెంట్స్ కూడా నెమ్మదిగా జోరందుకుంటున్నాయి. దీంతో దుర్గారావు దంపతులకు ఈవెంట్స్ కు సైతం ఆహ్వానాలు వస్తున్నాయి.
దీంతో వీరి ఆదాయం కూడా భారీగా పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం బట్టలు కుట్టి జీవించిన దుర్గారావు దంపతులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వచ్చిన పబ్లిసిటీతో మంచి ఆదాయం పొందుతున్నారని టాక్ వచ్చింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే బ్రాండ్ ప్రమోషన్స్ కు కూడా దుర్గారావు దంపతులకు ఆహ్వానాలు కూడా అందుతున్నాయి.