దీంతో సోషల్ మీడియాలో ఉన్న దుర్గారావు ఫ్యాన్స్ తెగ హర్టవుతున్నారు. హైపర్ ఆది తన స్కిట్స్ కు హైప్ తెచ్చుకునేందుకు ఇలా చీప్ ట్రిక్స్ వేయడం బాగోలేదని దుర్గారావు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో పాటు దుర్గారావు దంపతులకు పలు ఆశలు పెట్టుకొని సొంత ఖర్చులతో హైదరాబాద్ వచ్చి మల్లెమాల కార్యక్రమాల్లో ఏదో ఒక దాంట్లో అవకాశం కల్పిస్తారని భావించారు.
కానీ దుర్గారావు దంపతులకు ఆశాభంగం అయ్యింది. వారిని పిలిచినట్లే పిలిచి వాడుకొని వదిలేశారనే టాక్ అభిమానుల్లో ఉంది. నిజానికి మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ కార్యక్రమాల్లో ఏదో ఒక దాంట్లో దుర్గారావు తనకు తప్ప కుండా స్థానం దక్కుతుందని అనుకున్నారు. అయితే అతడిని అక్కడ పట్టించుకోలేదు. తన టాలెంట్ కు వేదిక అయిన ఢీ డ్యాన్స్ షో లో ప్రత్యేక ఎంట్రీ ఇద్దామని ఆశించాడు. ఎందుకంటే ఢీ డ్యాన్స్ షోలో దుర్గారావు పేరును పండు టీం తెగ వాడేసుకుంది. దీంతో కనీసం ఒక్క ఎపిసోడ్ లో అయిన తన స్పెషల్ ఎంట్రీ అవకాశం దక్కుతుందని దుర్గారావు భావించాడు. అయితే ఇటీవల శేఖర్ మాస్టర్ ఢీలో ఎంట్రీ ఇప్పిస్తానని మాటిచ్చాడనే టాక్ వినిపిస్తోంది. అయితే అదే షోలో యాంకర్ గా ఉన్న హైపర్ ఆది దుర్గారావు పట్ల అంత పాజిటివ్ కార్నర్ లేకపోవడంతో అతడి ఎంట్రీ పట్ల అంత ఆసక్తి చూపలేదని, నిర్వాహకులు అతడి అభిప్రాయం అడిగితే హైపర్ ఆది ఏమీ చెప్పలేదనే టాక్ ఉంది.
ఫేస్ బుక్ పరిచయం ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇఛ్చిన హైపర్ ఆది, తన లాగే సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయిన దుర్గారావు దంపతుల పట్ల ఎందుకిలా ప్రవరిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు దుర్గారావును వెన్నుతట్టి ప్రోత్సహించిన సుడిగాలి సుధీర్ మాత్రం వారిని సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దుర్గారావు మాత్రం తన టాలెంట్ కు ఇఫ్పుడు కాకపోయినా మరెప్పుడైనా అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు.