రామ్ , నాని రిజక్ట్ చేయడంతో ఇక ఏ హీరో అయితే బాగుంటారా అని మేకర్స్ ఆలోచన చేసి, దుల్కర్ ను అడిగి చూద్దామనుకున్నారంట. చివరకు ఆయనను సంప్రదించారట. కథ నచ్చడంతో దుల్కర్ వెంటనే ఓకే అనేయడంతో .. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం జరిగిపోయాయని చెబుతున్నారు. నాని .. రామ్ చేయలేమని చెప్పిన కథ, దుల్కర్ కి హిట్ ఇచ్చింది.
సీతారామం సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ థాంక్యూ మీట్ పెట్టి కేక్ కట్ చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ కి సీనియర్ హీరో నాగార్జున విచ్చేసి సీతారామం బృందాన్ని అభినందించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకున్నారు. ఇకపోతే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇదే అని కొనియాడారు. దీంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది.