అల్లు అర్జున్ (Allu Arjun)- సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప'(పుష్ప ది రైజ్) చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో అయితే రూ.105 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను సాధించింది
చివరకు పుష్పలో ఫాహద్ ఫాసిల్‌ను తీసుకున్నారు సుకుమార్. అతడి రోల్‌తో సినిమాతో పాటు.. అతడి నటనకు కూడా పుష్పలో మంచి మార్కులు వేశారు ఆడియన్స్. సెకండ్ పార్ట్’లో కూడా ఫాహద్ నటిస్తోన్నట్లు సమాచారం. పుష్ప 2 ను ఇండియా వైడ్ అన్ని భాషలతో పాటు.. మరో 5 భాషల్లో 'పుష్ప2' ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది .