2019లో టీవీల్లో ఎక్కువ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే..

2019 Yearender | గత కొంత కాలంగా ఆడియన్స్ అభిరుచుల్లో మార్పులు వచ్చాయి. ఏదైనా సినిమా బాగుందని టాక్ వచ్చినా.. ఠక్కున థియేటర్స్‌కు మాత్రం పరిగెత్తడం లేదు. ఒకవేళ తమ అభిమాన హీరో సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే.. వీరాభిమానులైతే మాత్రం థియేటర్స్‌కు వెళుతున్నారు. కానీ లేకపోతే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్,హాట్ స్టార్,సన్ నెక్ట్స్  వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వస్తే చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు.ఒకవేళ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడలేని వాళ్లు పండగ రోజుల్లో లేకపోతే హాలీడేస్ రోజున ప్రసారమైతే చూస్తున్నారు. ఇలా నిర్మాతలకు థియేట్రికల్ రూపంలో కంటే డిజిటల్,శాటిలైట్ రూపంలో బాగానే వెనకేసుకుంటున్నారు. అలా ఈ యేడాది డిజిటల్ కాకుండా శాటిలైట్ రూపంలో టీవీల్లో ప్రసారమయిన సినిమాల్లో ఎక్కువ టీఆర్‌పీ సాధించిన సినిమాలు ఏవేవి ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి..