ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం తాజా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, ‘శుభలేఖ’ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను నిశృంఖల ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. Photo : Twitter
అక్టోబర్ 22న యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అసలేం జరిగింది’ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించారు. ఈ సినిమా కూడా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించారు. ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమని, 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమా కూడా అక్టోబర్ 22న విడుదలకానుంది. నూతన నటీనటులు సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘మధురవైన్స్’యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ చిత్రానికి జయకిషోర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 22న దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మద్యానికి బానిసైన ఓ యువకుడు.. ఆ వాసన అంటేనే పడని ఓ యువతి మధ్య ప్రేమ కథగా ఈ సినిమా వస్తోంది. Photo : Twitter
(Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే సినిమా వచ్చి ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా లవ్ స్టొరీ 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుని హిట్ సినిమాగా మారింది. ఈ సినిమా అక్టోబర్ 22న ఆహాలో స్ట్రీమ్ కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. Love story on Aha Photo : Twitter
సునీల్, సుహాస్ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథతో వస్తున్న ఈ చిత్రానికి నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్కానుంది. Photo : Twitter