లక్ష్య.. నవంబర్ 19న విడుదల... యువ హీరో నాగశౌర్య (Naga Shourya) నటిస్తోన్న తాజా చిత్రం లక్ష్య (Lakshya). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్, నారాయణ్ దాస్ కే నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ (Ketika Sharma)హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్చరీ (విలువిద్య) క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పార్థు అనే క్రీడాకారుడి పాత్రలో నాగశౌర్య కనిపించనున్నారు. Photo : Twitter
రామ్ అసుర్ నవంబర్ 19న విడుదల... సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న లేటెస్ట్ సినిమా రామ్ అసుర్ ఈ సినిమా నవంబర్ 19న విడుదలకానుంది. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే రివీల్ అయింది. ఈ చిత్రంలో యువ నటులు అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్, చాందిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటులు సుమన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
అద్భుతం (OTT - హాట్‌స్టార్) నవంబర్ 19న విడుదల... యువ నటుడు తేజ సజ్జా, హీరోయిన్ శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘అద్భుతం’. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో హాట్ స్టార్‌లో నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించారు. ఈ చిత్రానికి రథన్ సంగీతం అందించారు. Photo : Twitter
దృశ్యం 2(ప్రైమ్ వీడియో)... నవంబర్ 25న విడుదల... విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సీక్వెల్ దృశ్యం2ను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దృశ్యం 2 ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మీనా, నదియా ఇతర కీలకపాత్రల్లో నటించారు. Photo : Twitter
గుడ్ లక్ సఖి.. నవంబర్ 26న విడుదల.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గుడ్ లక్ సఖి’. మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 26న విడుదల కానుంది. Photo : Twitter
అనుభవించు రాజా.. నవంబర్ 26న విడుదల.. యువ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం అనుభవించు రాజా. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్నారు. రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ నటిస్తున్నారు. Photo : Twitter