Shilpa Shetty: శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే..

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనాలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది. తెలుగులో మొదటిసారి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహస వీరుడు సాగరకన్య’ సినిమాలో సాగరకన్యగా నటించింది. ఈ సినిమాలో సాహసవీరుడుగా వెంకటేష్ నటించాడు. ఆ తర్వాత తెలుగులో మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీడెవడండీ బాబు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ఆజాద్‌లో కథానాయిగా నటించింది. చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలే వాడివి బాసూ’ సినిమాలో చివరగా కనిపించింది. మొత్తంగా తెలుగులో నాలుగు చిత్రాల్లో నటిచింది. ఈ భామ అటు కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.