తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.
'ది వారియర్' సినిమాలో తన పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుందని కృతి శెట్టి తెలిపింది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్ అని పేర్కొంది. కథ విన్న వెంటనే తాను కనెక్ట్ అయ్యానని, ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారని తెలిపింది.