ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ ‘ది వారియర్’. ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకున్న రామ్ పోతినేని ఇపుడు తమిళ దర్శకుడు లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది వారియర్’ మూవీతో పలకరించాడు. రామ్ తనకున్న మాస్ ఫాలోయింగ్‌తో ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర వచ్చిన ఓపెనింగ్స్‌తోనే ఈ చిత్రం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాాజగా ఈ సినిమా రెండు వారాల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది. Ram Pothineni The Warriorr Photo : Twitter
Ram - The Warrior : రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను రామ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమాను మల్లీప్లెక్స్‌లో రూ. 295, మాములు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 రేట్లతో విడుదల చేశారు. (Twitter/Photo)
మల్లీప్టెక్స్లో రూ. 295 రేటు, మాములు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 లతో ఈ సినిమాను విడుదల చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక హీరో రామ్ కూడా తన సినిమాకు టికెట్ రేట్స్ తగ్గిస్తే ఎక్కడా తాను తక్కువై పోతాననే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తెలంగాణలో ప్రభుత్వం నిర్ణయించిన భారీ ధరలకే ఈ సినిమాను విడుదల చేాసారు. ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినా.. ఆ తర్వాత రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. రామ్ పోతినేని కూడా తనను తాను ఎక్కువగా ఊహించుకోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్టు విమర్శకులు వేలెత్తి చూపెడుతున్నారు నెటిజన్స్. (Twitter/Photo)
ఒకవేళ ‘ది వారియర్’కు నామినల్ టికెట్ రేట్స్ అంటే మల్టీప్లెక్స్ లో రూ. 200, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 150 గనుక ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ ఇంకాస్త డీసెంట్‌గా ఉండేదని టాక్. రామ్ పోతినేని కూడా ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు ఎక్కువ టికెట్ రేట్స్ కారణంగా ప్రేక్షకులు గొప్ప గుణపాఠాలను నేర్పిన సంగతి మర్చిపోయినట్టు ఉన్నాడు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. ది వారియర్ సినిమాకు తగిలిన దెబ్బతో దిల్ రాజు.. ‘థాంక్యూ’ మూవీని సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 150, మల్లీప్లెక్స్‌లో రూ. 200 లకే టికెట్ రేట్ విక్రయిస్తున్నట్టు ప్రకటించాడు.అది కూడా అన్ని టాక్సులు కలిపి. ఆ తర్వాత ఈ సినిమాకు వచ్చిన టాక్ కారణంగా మొదటి రోజే చతికిల పడింది. (Twitter/Photo)
ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్స్‌లో టికెట్ రేట్స్ చూసి భయపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా లేనట్టు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 రూపాయలు ఉంది. ఇక మల్టీప్లెక్స్‌లో రూ. 295 ఉంది. ఈ రేట్స్‌తో ఒక ఫ్యామిలీలో నలుగురు సభ్యులు మల్లీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే టికెట్స్ కే రూ. 1200 అవుతోంది. దాంతో పాటు ఇంటర్వెల్లో ఛాయ్, బిస్కెట్, కూల్ డ్రింక్స్, కారు, బైకుతో పాటు పెట్రోల్ ఛార్జీలు కలిపితే ఎంత లేదన్నా.. రూ. 1500 నుంచి రూ. 2 వేలకు అవుతోంది. ఒక మాములు మధ్యతరగతి వాళ్లు ఈ రేట్స్‌ను భరించే పరిస్థితిలో లేరు.ఆ ఎఫెక్ట్ ఇపుడు రామ్ కూడా ఫేస్ చేసాడనే చెప్పాలి. దీనిపై ప్రస్తుతం నిర్మాత మండలి సమావేశమై టికెట్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలకు ఉపక్రమించారు. (Twitter/Photo)
ది వారియర్ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సస్‌లో భారీ ఎత్తున వి తెలంగాణ (నైజాం)లో 250 పైగా థియేటర్స్.. రాయలసీమ (సీడెడ్)లో 145 + ఆంధ్ర ప్రదేశ్ 300 + తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి 700 పైగా స్క్రీన్స్‌లో విడుదల కాబోతంది. ఒక కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + తమిళనాడు కలిపి 230 పైగా స్క్రీన్స్‌లో విడుదలవతోంది. ఇక ఓవర్సీస్లో 350 పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 1280 పైగా స్క్రీన్స్‌లో ’ది వారియర్’ మూవీ విడుదలైంది. (Twitter/Photo)
‘ది వారియర్’ చిత్రంలో రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty)నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకుంది. సెకండ్ వీక్ ఏరియా వైజ్‌గా కలెెక్షన్స్ విషయానికొస్తే.. Photo : Twitter
ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో రూ. 5.98 కోట్లు సీడెడ్ (రాయలసీమ)లో రూ. 3.28 కోట్లు ఉత్తరాంధ్రలో రూ. 2.51 కోట్లు ఈస్ట్ గోదావరి : రూ. 1.41 కోట్లు.. వెస్ట్ గోదావరి : రూ. 1.21 కోట్లు.. గుంటూరు : రూ. 2.03 కోట్లు ..కృష్టా : రూ. 1.02కోట్లు, నెల్లూరు : రూ. 68 లక్షలు ఓవరాల్‌గా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 18.12 కోట్లు (28.30 కోట్ల గ్రాస్) రాబట్టింది. మొత్తంగా రెండో వారంలో రూ. కోటిన్నర మాత్రమే వసూళ్లు సాధించింది.
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : రూ. 1.15 కోట్లు.. ఓవర్సీస్ : రూ. 71 లక్షలు తమిళ నాడు : రూ. 1.40 కోట్లు.. వాల్డ్ వైడ్‌గా రూ. 21.38 కోట్లు ( రూ. 36.90 కోట్ల గ్రాస్) మొత్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ది వారియర్’ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి. మొత్తంగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 17.62 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసనట్టే అని చెప్పాలి. మొత్తంగా థియేట్రికల్ పరంగా రూ. 17 కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. (Twitter/Photo)
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) : రూ. 11 కోట్లు రాయలసీమ (సీడెడ్) : రూ. 6 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ : రూ. 17 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 2 కోట్లు ఓవర్సీస్ : రూ. 2.10 కోట్లు తమిళ వెర్షన్ : రూ. 5 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.10 కోట్లు.. తెలుగులో 38.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి. ఓవరాల్‌గా తమిళంలో కలుపుకుంటే.. రూ. 44 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతోంది. కానీ ఏపీ, తెలంగాణలో రూ. 4 కోట్లకు తగ్గించారు. తమిళ వెర్షన్ రూ. 5 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు తగ్గించారు. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లకు తగ్గించారు. (Twitter/Photo)
‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే.. రామ్ (Ram Pothineni) మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది. Photo : Twitter