‘శతమానం భవతి’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్.. ఆ తర్వాత కూడా ఫ్యామిలీ సబ్జెక్టులతో ఆకట్టుకుంటున్నాడు. ఈయన ఇప్పుడు రూట్ మార్చి కొత్త పంథా వైపు అడుగులు వేస్తున్నాడు. సినిమాల నుంచి డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాడు. తాజాగా సతీష్ వేగేశ్న 'కథలు (మీవి-మావి)' అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే OTTలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ నుంచి మొదటి కథ 'పడవ' మోషన్ పోస్టర్ విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'పడవ' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి దర్శకుడు వేగేశ్న సతీష్‌కి.. అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరో సమీర్ వేగేశ్న, ఈషా రెబ్బా జంటగా నటించిన 'పడవ' ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.
కథలు అంటూ వస్తున్నాడు ఈయన. ఈ వెబ్ సిరీస్‌కు సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. కెమెరా వర్క్ దాము అందించాడు. ప్రముఖ గేయ రచయిత శ్రీమణి పాటలు రాసాడు. మధు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆర్ట్ వర్క్ రామాంజనేయులు చూసుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు వేగేశ్న సతీష్ స్వయంగా దుష్యంత్‌తో కలిసి నిర్మిస్తున్నారు.