‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దూకుడు కొనసాగుతుంది. ట్రేడ్ ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. గత కొన్నేళ్లుగా బడా హీరోల సినిమాలకు ఫస్ట్ డే వాళ్లకున్న ఇమేజ్ కారణంగా ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ చిన్న సినిమాగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రోజు రోజుకు స్క్రీన్స్ పెరగడంతో పాటు అదే రేంజ్లో కలెక్షన్స్ కొల్లగొడుతూ... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మూడో సోమవారం కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. 12 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది.
ఇప్పటికే ఈ చిత్రం 180 కోట్లకు పైగా వసూలు చేసింది. 200 కోట్ల వైపు అడుగులు వేస్తుంది ఈ చిత్రం. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 90వ దశకంలో కశ్మీర్లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. అయితే మరికొందరు చరిత్రను వక్రీకరించారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ సినిమా మొదటి వారం ఇండియాలో కేవలం 561 స్క్రీన్స్‌లో విడుదలైంది.
ఓవర్సీస్లో 113 స్క్రీన్స్‌లో మొత్తంగా 674 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారం వచ్చేసరికి 6 రెట్లకు పైగా 4000 పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతోంది. దీన్నిబట్టి ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా థియేటర్స్ ముఖం చూడని వాళ్లు కూడా ఈ సినిమా చూడడానికి టాకీస్‌లకు క్యూ కడుతున్నారంటే ఈ సినిమా ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆర్ఆర్ఆర్ విడుదలైన ఈ సినిమా హవా తగ్గకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాకు దెబ్బకు ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో పాటు అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ బాక్సాఫీస్ కలెక్షన్స్‌కు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ సినిమా విషయానికొస్తే.. 1990 దశకంలో సుందర కశ్మీర్లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎంతో హృద్యంగా కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాకు తెరరూపమిచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా ‘కశ్మీర్ ఫైల్స్’ టీమ్ మెంబర్స్ తన అధికార నివాసంలో పిలిచి వాళ్ళను అభినందించిన సంగతి తెలిసిందే కదా.
ఒకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఎవరేమన్నా.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కశ్మీర్ ఫైల్స్ ఏ ఒక్క క్షణం కూడా సినిమాలా అనిపించదు.. నాటి దురాగతానికి సాక్ష్యంగా కనిపిస్తుంది అనే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే థియేటర్స్‌లో కూడా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన సీనియర్ ప్రేక్షకులే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు కనక వర్షం కురుస్తోంది.
ఇక మొదటి రోజు కేవలం రూ. 3.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి సంచలనం సృష్టిస్తుంది. రెండో రోజు 8.50 కోట్లు.. మూడో రోజు 15.50 కోట్లు.. నాలుగో రోజు 15.05 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజు రూ. 18.02, ఆరో రోజు రూ. 19.05 కోట్లు.. ఏడో రోజు.. ఈ సినిమా రూ. 18.05 కోట్లు.. ఎనిమిదో రోజు హోళి పండగ నాడు.. రూ. 19.15 కోట్లు వసూళు చేస్తే 9వ రోజు శనివారం.. 24.80 కోట్లు.. 10వ రోజు 26 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ట్రేడ్ పండితులను ఆశ్యర్య చకితులను చేస్తోంది. మొత్తంగా 11 రోజుల్లో 187 కోట్లు వసూళు చేసింది. ఇదే వారం 200 కోట్ల క్లబ్బులో జాయిన్ కానుంది ఈ చిత్రం.