కరోనా తర్వాత బాలీవుడ్లో ఈ ఏడాది భారీ సినిమాలు విడుదలయ్యాయి. స్టార్ హీరోలు సైతం భారీ బడ్జెట్లతో సినిమాలు రూపొందించారు. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అలరించాయి మరికొన్ని అడ్రస్ లేకుండా గల్లంతయ్యాయి. అయితే బాలీవుడ్ ఏడాది బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. (Twitter/Photos)
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి.. లాంటి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించారు. నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు.ఈ సినిమా ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలన్నింటిలో అత్యధికంగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 252 కోట్లు సాధించింది.
బాలీవుడ్లో అత్యంత భారీ ప్రాజెక్టుగా బ్రహ్మస్త్ర ప్రాజెక్ట్ ప్రకటించగానే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక భారీ తారాగణం, ప్రతిష్టాత్మకమైన సంస్థలు సినిమాను నిర్మించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పలుమార్లు వాయిదాలు.. వివాదాలతో ట్రావెల్ చేస్తూ సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తొలిసారిగా రణ్‌బీర్ కపూర్, ఆలియా జంటగా నటించారు. ఇక ఈ సినిమా రూ. 236 కొట్లు సాధించింది.
బ్రహ్మస్త్ర తర్వాత బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా దృశ్యం 2. తెలుగు, మలయాళంలో వచ్చిన దృశ్యం 2 మూవీకి ఇది రిమేక్. అయినా సరే బాలీవుడ్ ప్రేక్షకులు దృశ్యం 2 సినిమాకు పట్టం కట్టారు. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్, శ్రీయ శరణ్, టబు, అక్షయ్ కన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక దృశ్యం 2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 225 కోట్లు కొల్లగొట్టింది.
ఇక కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భూల్ భులయ్య 2.ఈ సినిమాలో టబు ప్రధాన పాత్రలో కనిపించింది. సస్పెన్స్, హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కింది. దర్శకుడు అనీష్ బాజ్మీ ఈ సినిమాను రూపొందించారు. మే 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రూ. 186 కోట్లు సాధించింది.
ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేశ్యగా నటించిన మూవీ గంగూభాయి కతియవాడి. ఈ సినిమా ఆలియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎస్ హుస్సేన్ జైదీ, జేన్ బార్గ్స్ అనే ఇద్దరు రైటర్స్ ముంబాయిలోని ప్రతీ కోణాన్ని పరిశీలించి అండర్‌వరల్డ్ ప్రపంచం గురించి అందరికీ చెప్పే 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఒక చాప్టర్ 'గంగూబాయి'.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సినిమా 132 కోట్లు సాధించింది.