Pawan Kalyan : ‘ది కశ్శీర్ ఫైల్స్’ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను అభినందించిన పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవన్ కళ్యాణ్‌ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్‌తో చేస్తోన్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్.. ఈ యేడాది ‘భీమ్లా నాయక్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ కోవలో వరుసగా తాను కమిటైన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్ త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు(Twitter/Photo)
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన మూవీ అన్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కదిలించేలా ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన సినిమా నిర్మించిన అభిషేక్ అగర్వాల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు త్వరలో ఆయన నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)
ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా బడా హీరోల సినిమాలకు ఫస్ట్ డే వాళ్లకున్న ఇమేజ్ కారణంగా ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ చిన్న సినిమాగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రోజు రోజుకు స్క్రీన్స్ పెరగడంతో పాటు అదే రేంజ్లో కలెక్షన్స్ కొల్లగొడుతూ... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్‌గా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. (Twitter/Photo)
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయానికొస్తే.. 1990 దశకంలో సుందర కశ్మీర్లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎంతో హృద్యంగా కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాకు తెరరూపమిచ్చారు. ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు ఝల్లు కురుస్తోంది. (twitter/Photo)