The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ మరో సెన్సేషనల్ రికార్డ్‌తో బాలీవుడ్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది. గత కొన్నేళ్లుగా బడా హీరోల సినిమాలకు ఫస్ట్ డే వాళ్లకున్న ఇమేజ్ కారణంగా ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ చిన్న సినిమాగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రోజు రోజుకు స్క్రీన్స్ పెరగడంతో పాటు అదే రేంజ్లో కలెక్షన్స్ కొల్లగొడుతూ... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టింది. (Twitter/Phto)
మొదటి వారం ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్లో 113 స్క్రీన్స్ కలపి మొత్తంగా 674 స్క్రీన్స్‌లో విడులైన ఈ సినిమా.. రెండో వారం వచ్చేసరికి 6 రెట్లకు పైగా 4000 పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతోందంటే ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఎపుడో కానీ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి అద్భుతాలు జరగడం రేర్.. అలాంటి అద్భుతాన్ని ‘ది కశ్మీర్ ఫైల్స్’ చేసి చూపించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రూ. 340 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పాండమిక్ తర్వాత డైరెక్ట్ హిందీ చిత్రాల్లోఅత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులను ఎక్కింది. ఆ తర్వాత యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ ఎక్కువ వసూళ్లు సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
ఈ సినిమా విషయానికొస్తే.. 1990 దశకంలో సుందర కశ్మీర్లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎంతో హృద్యంగా కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాకు తెరరూపమిచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా ‘కశ్మీర్ ఫైల్స్’ టీమ్ మెంబర్స్ తన అధికార నివాసంలో పిలిచి వారిని అభినందించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఒకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఎవరేమన్నా.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (Twitter/Photo)
గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను అభినందించారు.అప్పట్లో కశ్మీర్లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు.అంతేకాదు ఈ సినిమా చూడమంటూ ప్రజలకు పిలుపు నివ్వడం కూడా ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ ఏర్పడేలా చేసింది. ప్రధాని ఈ సినిమాను ప్రశంసిండంతో ఈ సినిమా చూడటానికి కామన్ ఆడియన్స్ సహా చాలా మంది థియేటర్స్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. (Twitter/Photo)
థియేటర్స్‌కు వెళ్లిన ఆడియన్స్‌కు అక్కడ సినిమా కంటే కూడా కశ్మీర్ కథ, కన్నీటి వ్యధ కనిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగినపుడు అపుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.. కశ్మీర్లో జరిగిన పండిట్స్ మారణహోమం నిజంగా అంత దారుణంగా సాగిందా..? వీటన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ అంటే భారత్‌లో భాగం కాదేమో అనే ప్రశ్నలు ఈ సినిమా చూస్తే తలెత్తుతాయంటున్నారు ప్రేక్షకులు. 1990ల్లో కశ్మీర్ పండిట్స్‌ను చంపిన ఉదంతాలు ఇప్పటికే చాలాసార్లు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా వచ్చాయి. అయితే ‘కశ్మీర్ ఫైల్స్’ మాత్రం పచ్చిగా తీసిన నిజం అంటున్నారు ప్రేక్షకులు విశ్లేషకులు. (Twitter/Photo)
ఈ కశ్మీర్ ఫైల్స్ చూసిన కశ్మీర్ పండిత్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి సినిమా చేయాలంటే డబ్బులు మాత్రమే కాదు.. ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే చరిత్రలో ఏం ఉందో.. ఎవరిది తప్పుందో ఎవరూ చెప్పరు.. ఏదైనా ఓ సైడ్ తీసుకుని సినిమా చేయాల్సిందే. వివేక్ అగ్నిహోత్రి మాత్రం చాలా వరకు నిజాలే సినిమాలో చూపించాడని అప్పటి పండిట్స్ కూడా చెప్తున్న మాట. అందుకే ఈ చిత్రానికి ఇంతగా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. (Twitter/Photo)
ఇప్పటికే ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు టాక్స్ ఫ్రీ ప్రకటించాయి. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సినిమ ా కోసం హాఫ్ డే లీవ్ కూడా మంజూరు చేయడం విశేషం. చాలా యేళ్ల తర్వాత బాలీవుడ్లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రికి కేంద్రం Y కేటగిరి భద్రత కల్పించింది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. (Twitter/Photo)
కశ్మీర్ ఫైల్స్ ఏ ఒక్క క్షణం కూడా సినిమాలా అనిపించదు.. నాటి దురాగతానికి సాక్ష్యంగా కనిపిస్తుంది అనే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే థియేటర్స్‌లో కూడా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన సీనియర్ ప్రేక్షకులే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు కనక వర్షం కురిపించింది. ఈ సినిమా నేటి నుంచి జీ 5లో హిందీతో పాటు తెలుగు, ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో ఈ సినిమా వీక్షించని ప్రేక్షకులు ఎంచక్కా ఓటీటీ వేదికగా ఈ సినిమా చూడొచ్చు.
9 ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీలో అనుపమ్ ఖేర్ నటన సినిమాకు హైలైట్.. మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి.. అంతా ప్రాణం పెట్టి నటించారు.. ఓవరాల్‌గా కాశ్మీర్ ఫైల్స్.. కేవలం సినిమా మాత్రమే కాదు.. మరుగున పడిపోయిన చరిత్రకు దృశ్యరూపం కూడా అనే ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు ప్రశంసలతో పాటు వివాదం కూడా చుట్టుముడుతుంది. మొత్తంగా 2022లో బాలీవుడ్ కాదు.. కాదు.. మన దేశంలోనే పెట్టిన పెట్టుబడితో పోలిస్తే.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. (Twitter/Photo)