Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా (70) ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఇందిరా పార్థీవ దేహానికి కృష్ణ, మహేష్‌తో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ గల్లా శేషగిరిరావు, గల్లా పద్మ, నమ్రత మహేష్‌లు అంతిమ నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. Photo : Twitter
వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు. గత కొంత కాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోవైపు పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఆమె కృంగి పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. Photo : Twitter
కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. Photo : Twitter
అటు ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఇందిరా దేవి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు. Photo : Twitter
మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ.. మూడేళ్ల క్రితం రెండేళ్ల క్రితం విజయ నిర్మల కన్నుమూయం ఒక దెబ్బ అయితే.. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం.. తాజాగా మొదటి భార్య.. ఇందిరా దేవి తుది శ్వాస విడవడం బాధాకరం. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ.. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘శ్రీశ్రీ ’ మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు. ఇంటి పట్టునే ఉంటున్నారు. Photo : Twitter
ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ మూడు రోజులు షూట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. Photo : Twitter