The Family Man Season 2: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వివరాలివే
The Family Man Season 2: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వివరాలివే
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ కు శుభవార్త. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తమిళం, తెలుగు వెర్షన్లు సైతం అందుబాటులోకి వచ్చేశాయి. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటన్న విషయం తెలిసిందే. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో సీజన్ 1 విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్-2 పై అంచనాలు అధికమయ్యాయి. ఈ సీజన్ 2లో అక్కినేని సమంత కీలక పాత్ర పోషించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
దీంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య సీజన్-2 2021 జూన్ 3న విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కానీ ఈ వెబ్ సిరీస్ ను కేవలం హిందీలో మాత్రమే విడుదల చేశారు. దీంతో తెలుగు, తమిళ ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ భాషల్లో ఎప్పుడు విడుదల అవుతుందా? అంటూ తెలుగు, తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ తెలుగు, తమిళ, ఇంగ్లిష్ డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేసింది ‘ఫ్యామిలీ మ్యాన్’ టీం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ వెర్షన్ లు స్ట్రీమ్ అవుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)