అమెజాన్ ప్రైమ్ వీడియో" width="1600" height="1600" class="size-full wp-image-1146404" /> ప్రభాస్ సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ఈయన తన స్థాయి పెంచుకుంటున్నాడు. తెలుగు హీరోగానే ఉండిపోవాలని అస్సలు అనుకోవడం లేదు ప్రభాస్. అందుకే ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న సినిమాలు.. అవి జరుపుకుంటున్న బిజినెస్ అన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉన్నాయి.
కొన్ని రోజుల కింద నెట్ ఫ్లిక్స్ కూడా ఈ చిత్రానికి 300 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై నిర్మాతలు స్పందించలేదు. మరోవైపు ఇప్పుడు అమెజాన్ ఏకంగా మరో 50 కోట్లు అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ లాంటి హీరో సినిమాను ఓటిటి రిలీజ్ చేయడం అనేది అసాధ్యమే అవుతుంది.
ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని సినిమా చూస్తారు. మరి అలా చేస్తే థియేటర్స్‌కు ఎంత నష్టం వస్తుందనేది కూడా అంచనాలు వేయలేరు. అయితే ఎన్ని వందల కోట్లు ఆఫర్ ఇచ్చినా నిర్మాతలు మాత్రం రాధే శ్యామ్ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే అలాంటి సినిమాలు కేవలం థియేటర్స్ ఎక్స్‌పీరియన్స్‌తోనే చూడాలని వాళ్ల ఆశ.