టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నట వారసుడు నాగ చైతన్య (Naga Chaitanya) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేస్తున్నారు చైతూ. అయితే తన తాజా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని విషయాల్లో ఆయన ఓపెన్ కావడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ థాంక్యూ చిత్రంలో నాగ చైతన్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ నటించారు. మనం సినిమా తర్వాత విక్రమ్- చైతన్య కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై జనాల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.