అయితే ఈ సినిమా విషయంలో ఓ వివాదం రాజుకుంది. టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్ (Kollywood) మధ్య వారసుడు మూవీ చిచ్చుపెట్టింది. ఈ సినిమా గురించి తెలుగు సినీ పరిశ్రమ, తమిళ సినీ పరిశ్రమ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వారసుడు (Varasudu) సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించడమే.. ఈ వివాదానికి కారణం.
ఐతే సంక్రాంతికి (Sankranti) ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు పెద్ద ఎత్తున సినిమా థియేటర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వారసుడు సినిమాతో పాటు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాాలు కూడా విడుదలవుతున్నాయి. ఐతే దిల్ రాజు.. వారసుడు కోసం.. పెద్ద మొత్తంలో థియేటర్లు బ్లాక్ చేయడంతో.. వీరి సినిమాలకు కూడా థియేటర్ల దొరకలేని పరిస్థితి నెలకొందట.
ఈ క్రమంలో వారసుడు సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐతే వారసుడు సినిమా.. డబ్బింగ్ చిత్రం కాదని.. ద్విభాషా చిత్రమని ఆ సినిమా యూనిట్ చెబుతోంది. అంతేకాదు విజయ్ మాత్రమే తమిళ నటుడు అని.. దర్శక నిర్మాతలు తెలుగువారేనని పేర్కొంది. అందువల్ల దీనిని తమిళ చిత్రంగా పరిగణించకూడదని తెలిపింది.
వారసుడు సినిమా వివాదంపై టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ స్పందించారు. సినిమాలను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. సినిమాకు ఎల్లలు లేవని.. సౌత్, నార్త్ అనే భేదాలను తొలగించామని అన్నారు. సినిమా బాగుంటే ఎక్కడైనా ఆడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ వివాదంపై దిల్ రాజు మాత్రం ఇంతవరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. (File/Photo)