Tv Stars in Lockdown: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. దీంతో పలు రంగాలు మూతపడగా సినీ రంగం కూడా మూతపడింది. అంతేకాకుండా ఇటీవలే ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించారు. దీంతో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఇదిలా ఉంటే బుల్లితెర నటులు కూడా ప్రస్తుతం తమ సీరియల్స్ వాయిదా పడగా వాళ్ళు ఇంట్లో ఎలా గడుపుతున్నారు ఒకసారి చూద్దాం.
అనసూయ భరద్వాజ్: బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.ఇక ప్రస్తుతం షూటింగ్స్ వాయిదా పడగా తన కుటుంబ సభ్యులతో తెగ సంతోషంగా గడుపుతుంది.ఇక అనసూయ తన ఇంట్లో కూర్చొని ఓ వీడియోను తీయగా అందులో తన కొడుకు పెట్ లతో ట్రైనింగ్ ఇస్తుండగా.. అనసూయ ఇట్స్ ట్రైనింగ్ టైం అంటూ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
రోహిణి: బుల్లితెర నటి, కమెడియన్ రోహిణి. ప్రస్తుతం బుల్లితెరలో లేడీ కమెడియన్ గా నటిస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత బుల్లితెరలో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లో ఉంటూ ఇండోర్ గేమ్స్ తెగ బిజీగా మారింది. అంతేకాకుండా తెగ వర్కౌట్ లతో కూడా బిజీ గా వుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
సిద్ధార్థ వర్మ : ప్రముఖ బుల్లితెర నటుడు సిద్ధార్థ్ వర్మ. తన భార్య బుల్లితెర నటి విష్ణుప్రియ తో కలిసిఇంట్లో తెగ సంతోషంగా గడుపుతున్నాడు. దాగుడుమూతలు ఆడుతున్న ఈ జంట తాజాగా ఈ వీడియో ను షేర్ చేసుకున్నారు. ఇక వీళ్ళు కలిసి పలు సీరియల్ లో నటిస్తుండగా బుల్లితెర లో క్యూట్ కపుల్ గా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈ జంట సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.