యాంకర్ సుమ కనకాల తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలాకైన మాటలతో అలరించే సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ అంటూ వచ్చిన ఈ సినిమా కోసం సుమ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్లో చేశారు. అయినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా ఏమాత్రం ఆదరణకు నోచుకోలేదు. Photo : Twitter
దాంతో సుమ పూర్తిగా డీలా పడిపోయి, మళ్లీ మరోసారి సినిమాలు చేసే ఆలోచన కూడా వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు తనకు అచ్చిరావని భావిస్తున్నారట. అందులో భాగంగా తను సక్సెస్ ఫుల్‌గా వున్న టీవీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. ఈ కారణంతోనే జయమ్మ పంచాయితీ తర్వాత కొంత మంది కొత్త దర్శకులు కొన్ని స్క్రిప్ట్‌లు తీసుకోచ్చిన సుమ నో చెబుతున్నారట. Photo : Twitter
Suma Kanakala : యాంకర్ సుమ (Anchor Suma) అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్లలో ఒకరిగా పేరుపొందిన ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు. Photo : Instagram
ఇక తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వచ్చిన ఈ సినిమాలో తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించారు. మంచి అంచనాల నడుమా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాగానే అలరిస్తోంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే సుమకు అన్యాయం జరిగిందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సుమ ప్రధాన పాత్రలో శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి థియేటర్ల విషయంలో సుమకు అన్యాయం జరిగిందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే.. నిన్న ఒక్కరోజే మూడు తెలుగు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. Photo : Twitter
యాంకర్ సుమ జయమ్మ పంచాయితీ సినిమాతో పాటు విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం, శ్రీ విష్ణు భళా తందనాన సినిమాలు విడుదలైయ్యాయి. వీటికి తోడు ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్, కెజియఫ్ సినిమాలకు ఇంకా మంచి ఆదరణ ఉండడంతో సుమ సినిమాకు థియేటర్లు దక్కలేదు. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలో సుమ జయమ్మ పంచాయితీ సినిమాకు షోస్ దక్కాయి. దీంతో ఒక విధంగా సుమ సినిమాకు అన్యాయం జరిగిందని, నెటిజన్స్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ మండి పడుతున్నారు. సినిమా ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైతే కలెక్షన్స్ బాగా వచ్చేవని కామెంట్స్ చేస్తున్నారు. Photo : Twitter
ఇక సుమ యాంకరింగ్ విషయానికి వస్తే.. యాంకర్ సుమ (Anchor Suma)అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. Photo : Twitter
దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ సమీప భవిష్యత్తులో ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ (Suma Kanakala) స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. Photo : Twitter