Navya swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి. చక్కని అందం, ఆకట్టుకునే నటనతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించింది. ఇక బుల్లితెరలో పలు షోలలో పాల్గొని బాగా సందడి చేస్తుంది. తనతో పాటు ఆమె కథ సీరియల్ లో నటించిన రవికృష్ణతో బాగా సన్నిహితంగా ఉంటుంది. నిత్యం ఫొటో షూట్ లతో బాగా బిజీగా ఉంటూ వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇక ఈ రోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఓ ఫోటో పంచుకుంది. అందులో ఎల్లో కలర్ చీరలో అచ్చం బొమ్మల కనిపిస్తుంది నవ్య స్వామి.