Ramya Krishna : రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్లపాటు తెలుగు వారిని అలరించారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణకు.. మరోసారి మంచి ఆఫర్స్ వస్తున్నాయి... ఇటీవల ఆమె రంగ మార్తాండలో నటించారు. (Image: Instagram)
కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేశారు. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేశారు తెలుగు వారిని. ఆ తర్వాత తల్లి, వదిన.. పలు పాత్రల్లో నటించినా, బాహుబలి చిత్రాల్లో ‘శివగామి’ పాత్ర ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేశారు. (Photo : Twitter)
రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండలో నటిస్తున్నారు. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాతో పాటు రమ్యకృష్ణ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్విన్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి.. అదరగొట్టిన సంగతి తెలిసిందే. వీటితో పాటు రమ్యకృష్ణ పలు షోలకు వ్యాఖ్యాతగాను, కొన్ని సిరీయల్స్‌లో కూడా నటిస్తున్నారు. రమ్యకృష్ణ..అప్పటికి..ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.. (Photo : Twitter)
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈమె..రోజుకు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అంటే ఒక సినిమాలో పది రోజులు పని చేస్తే కోటి వరకు తీసుకుంటుందన్న మాట. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా కొనసాగుతోన్న రష్మిక మందన్న సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు తీసుకుటారు. దీన్ని బట్టి చూస్తే రమ్యక్రిష్ణ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. Photo : Twitter
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో వచ్చింది. ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో వర్సటైల్ యాక్టర్ రమ్యకృష్ణ కనిపించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న గ్రాండ్‌గా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి (Ramya Krishna) రమ్యకృష్ణను డైరెక్ట్ చేశాడు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాకు ప్రశంసులు వచ్చాయి కానీ.. పెద్దగా కలెక్షన్స్ మాత్రం రాలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ లేదు. రామ్ చరణ్‌తో తీసిన గోవిందుడు అందరివాడేలే పరవాలేదనిపించింది.. Photo : Twitter
ఈ రంగమార్తాండ మరాఠి క్లాసిక్ సినిమా ‘నట సమ్రాట్’ మూవీకి రీమేక్‌గా వచ్చింది. అక్కడ నానా పాటేకర్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల విషయానికి వస్తే... ఒరిజినల్ చిత్రం నటసామ్రాట్‌లో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేశారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మనందం కూడా ఈ సినిమాలో నటించారు.. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రమ్యకృష్ణ నటించిన మరో సినిమా లైగర్. ఈ సినిమా కూడా మంచి అంచనాల నడుమ వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోకు తల్లిగా కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ దాదాపు 85 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. Photo : Twitter
ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథ. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వచ్చింది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మించారు. Photo : Twitter
లైగర్ తర్వాత విజయ్ హీరోగా పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమాను మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట పూరీ. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఇక విజయ్, సమంతలు కలిసి ఖుషి అనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Twitter