Karthika Deepam - Premi Viswanath: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది వంటలక్క. వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ లో దీప పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ పలు భాషలలో కూడా పలు సీరియల్ లో నటించి మంచి అభిమానాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో దేవి అవతారం లో అందంగా కనిపించింది. ఇక ఈ ఫోటోలను చూసిన వంటలక్క అభిమానులు కూడా తెగ లైక్స్ చేస్తున్నారు.