తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు బాగా ఎదిగిపోయింది. మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా బాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోవడం లేదు. కరణ్ జోహార, కంగన రనౌత్ లాంటి వాళ్లైతే బాలీవుడ్ ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ కాదు టాలీవుడ్ టాప్ అంటూ కామెంట్స్ కూడా చేసారు. ఇక్కడ మన సినిమాలను చూసి బాలీవుడ్ కూడా కాపీ కొడుతుంది. ఇక్కడి సినిమాలనే ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. దాంతో మన సినిమాల స్థాయితో పాటు రెమ్యునరేషన్స్ కూడా పెరిగాయి. మరీ ముఖ్యంగా మన దర్శకులు ఇప్పుడు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. మరి తెలుగులో ఒక్కో సినిమాకు ఏ దర్శకుడు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో చూద్దాం..