Anchor Rashmi: బుల్లితెర యాంకర్ రష్మీ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ సమాజం పట్ల బాగా స్పందిస్తూ ఉంటుంది. ఇక తను మూగజీవుల పై ఎంతో ప్రేమ చూపిస్తుంది. ఇటీవలే తిరువనంతపురం బీచ్ దగ్గర ఒక కుక్కని ముగ్గురు వ్యక్తులు దారుణంగా దాడి చేసి హత్య చేయగా దానికి ఎంతో మండిపడింది రష్మీ. తాజాగా తన ఇన్స్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఓ మూగజీవి తన తల్లి కనిపించకపోయేసరికి వెతుకుతుండగా చివరికి తల్లిని చూసి దాని దగ్గరికి వెళ్లి ముద్దాడింది. ఇక ఆ సీన్ ను చూసిన రష్మీ.. తల్లిని చూసిన చిన్న జీవి ఎంతో సంతోషంగా ఉందని, అది చూసిన తనకు ఏడుపు వచ్చేసిందట. మనకు ఉన్నట్టే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని, మనం బతికేందుకు, రుచులు తీర్చుకునేందుకు వాటిని చంపి తినడం వేరు, మనం మంచిగా బతికి వాటిని బతకనిద్దామని తెలిపింది రష్మీ.